Air Conditioners : ఎయిర్ కండిషనర్స్ వినియోగం ఆరోగ్యానికి లాభమా…నష్టమా?..

ఏసిలు వాడటం వల్ల ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పాలి. వాతావరణంలో శరీరానికి ఉపయోగపడే గాలి అందకపోవటం జరుగుతుంది. ఎక్కవగా ఏసిల్లో గడిపేవారిలో కార్డియోవాస

Air Conditioners : ఇటీవలి కాలంలో ఏసి ల వాడకం బాగా పెరిగింది. దీనికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. వేడి వాతావరణం నుండి రక్షణ కోసం చాలా మంది ఎయిర్ కండీషనర్స్ లను గృహాలలో , కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకుంటూ సౌకర్యవంతంగా ఉంటున్నారు. అయితే ఇది ఒకింత ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ మరికొన్ని సందర్భాల్లో దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.
ఎయిర్‌ కండిషనర్స్‌తో ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.

వాతావరణ పరిస్ధితులు మనుషుల ఆరోగ్యానికి కొంత అనుకూలంగా ఉన్నా, మరికొన్ని సందర్భాల్లో అవే వాతావరణ పరిస్ధితుల కారణంగా వ్యాదుల బారిన పడాల్సి వస్తుంది. ఎయిర్‌ కండిషనర్‌ అనేది వాతావరణ పరిస్ధితుల నుండి మనల్ని కొంత మేర రక్షించగలిగేదిగా ఉంటుంది. అనారోగ్యాల బారిన మనం పడకుండా కాపాడుతాయి. ఇటీవలికాలంలో ఎయిర్‌ కండిషనర్స్‌ వచ్చిన కొత్త టెక్నాలజీలతో సూక్ష్మస్థాయిలో ఉండే కాలుష్యాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో అధిక వేడిని పోగొట్టేందుకు ఏసి బాగా పనిచేస్తుంది. దీని వల్ల అధిక వేడిమి వల్ల కలిగే సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

ఏసిలు వాడటం వల్ల ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పాలి. వాతావరణంలో శరీరానికి ఉపయోగపడే గాలి అందకపోవటం జరుగుతుంది. ఎక్కవగా ఏసిల్లో గడిపేవారిలో కార్డియోవ్యాస్కులర్ సమస్యలు, శ్వాసకోశ సమస్యలైన ఆస్థమా, పిల్లికూతలు రావచ్చు. ఏసీ వల్ల ఒకరకం నిమోనియా అయిన లెజియోన్నేరిస్‌ వంటి వ్యాధులూ రావచ్చు. అదేపనిగా ఏసీలో ఉన్నవారు నీళ్లు తక్కువగా తాగుతూ ఉండటంతో కిడ్నీలో స్టోన్స్‌ ఏర్పడవచ్చు. చర్మంపై దురదలు, తలనొప్పులు, అలసట వంటివి రావచ్చు. నిత్యం ఏసిల్లో గడిపేవారిలో భవిష్యత్తులో వివిధ రకాల సమస్యలు వారిని చుట్టుముట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆ వాతావరణ పరిస్ధితులకు అలవాటు పడినవారు ఇతర వాతావరణ పరిస్ధితుల్లో ఉండాల్సి వస్తే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ సహజసిద్ధమైన వాతావరణంలో గడిపేందుకు సమయం కేటాయించాలి. ఇలా చేయటం వల్ల మన శరీరం అన్ని వాతావరణాలను తట్టుకునేలా మనగలుగుతుంది. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో తప్ప ఇతర సమయాల్లో సాధారణ వాతావరణంలో గడపటానికే ఆసక్తి చూపాలి. ఏసీలోని ఫిల్టర్స్‌ తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపించకుండా ఉంటాయి. అత్యవసర వినియోగానికి తప్ప ఏసిలను వాడకపోవటమే మంచిది.

ట్రెండింగ్ వార్తలు