Bhagavanth Kesari : భగవంత్ కేసరి సెకండ్ సింగల్ వచ్చేసింది.. ఉడతా ఉడతా ఉష్..

బాల‌కృష్ణ భగవంత్ కేసరి నుంచి సెకండ్ సింగల్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది.

Balakrishna Sreeleela Bhagavanth Kesari second song released

Bhagavanth Kesari : నంద‌మూరి బాల‌కృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. కాజ‌ల్ అగ‌ర్వాల్‌ (Kajal Aggarwal) ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తుంది. ఈ నెల అక్టోబర్ 19న ఈ మూవీ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ప్రమోషన్స్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. ఇప్పటికే మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. తాజాగా సెకండ్ సింగల్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ సాంగ్ లో బాలయ్య, శ్రీలీల మధ్య బాండింగ్ ని చూపించారు.

Also Read : Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. దేవర కూడా రెండు భాగాలుగా..? కొరటాల శివ అప్డేట్..!

‘ఉడతా ఉడతా ఉష్.. ఉయ్యాలో ఉయ్యాలో’ అంటూ సాగే ఈ పాట తెలంగాణ జానపద సాంగ్స్ మోడ్ లో సాగింది. థమన్ సంగీతం అందించిన ఈ పాటని ఎస్పీ చరణ్ పాడాడు. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా భాను డ్యాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. మ్యూజిక్ అండ్ పిక్చరైజేషన్ పరంగా సాంగ్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. కాగా ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని కూడా గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారని సమాచారం.

ఈ నెల 8న వరంగల్ లో భారీగా ఫంక్షన్ ఏర్పాటు చేసి ట్రైలర్ ని లాంచ్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సింది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. జైలర్ అండ్ విక్రమ్ తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. అనిల్ రావిపూడి ఈ మూవీతో బాలయ్యని సరికొత్తగా చూపించబోతున్నాడట. సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు