Bigg Boss Elimination : బిగ్బాస్ నాలుగు వారాలు పూర్తయింది. ఐదో వారం వీకెండ్ కూడా వచ్చేసింది. ఇప్పటికే హౌస్ నుంచి నాలుగు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన ముగ్గుర్ని ఊహించినా రతికని ఎలిమినేట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఇక ఈ ఆదివారం ఐదో ఎలిమినేషన్ ఉండనుంది.
ఈ బిగ్బాస్ వారం నామినేషన్స్ లో.. తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్ ఉన్నారు. అయితే ఈ వారం అమర్ దీప్(Amardeep) ఎలిమినేట్ అవుతాడని టాక్ నడుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా అమర్ దీప్ ఇండైరెక్ట్ గా ఇదే చెప్పినట్టు అనిపిస్తుంది. శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ నడుస్తుండగా శివాజీ(Sivaji) ఎప్పటి లాగే ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తుండటంతో అమర్ దీప్.. నువ్వు కంగారు పడకు అన్నా ప్రశాంత్ గెలుస్తాడు అని చెప్పాడు.
Also Read : Bigg Boss 7 Day 333 : బిగ్బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ ఎవరో తెలుసా?
దీంతో శివాజీ మళ్ళీ.. జనాలు చూస్తున్నారు అని అన్నాడు. దీంతో అమర్ దీప్ ఆ జనాలు చూస్తే ఎల్లుండి నేనే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతాను అని అన్నాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి. సోషల్ మీడియాలో కూడా అమర్ దీప్ ఎలిమినేట్ అవుతాడు అని వస్తుండటంతో బిగ్ బాస్ ఐదో వారం అమర్ దీప్ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తుంది. రేపు ఆదివారం ఎపిసోడ్ లో అధికారికంగా తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.