Bigg Boss : బిగ్‌బాస్ హౌస్‌లో ఆ వాయిస్ ఎవరిది? బిగ్‌బాస్‌లా మాట్లాడే పర్సన్ ఎవరో తెలుసా?

బిగ్‌బాస్ వాయిస్ అంటే చాలా గంభీరంగా ఉండాలి. హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ అందర్నీ కంట్రోల్ చేసేలా ఉండాలి వాయిస్. అందుకే దీనికి డబ్బింగ్ ఆర్టిస్టులని తీసుకుంటారు. బిగ్‌బాస్ వాయిస్ లో వినిపించేది షో నిర్వాహకులు రాసినా చెప్పేది మాత్రం ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్.

Bigg Boss House Voice fame Renukuntla Shankar Details back bone of Bigg boss Telugu Show

Bigg Boss Voice : తెలుగు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఏడవ సీజన్ మొదటి వారం పూర్తయి రెండో వారం సాగుతుంది. బిగ్‌బాస్ హౌస్ అంటే అందులో కంటెస్టెంట్స్ కంటే ముందు బిగ్‌బాస్ ఎవరు అనేదే అందరికి ఆసక్తిగా ఉంటుంది. బిగ్‌బాస్ లా మాట్లాడేది ఎవరు? బిగ్‌బాస్ గొంతు ఎవరిది? హౌస్ లో కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేసే బిగ్‌బాస్ వాయిస్ ఎవరు అని అంతా ఆలోచిస్తారు.

బిగ్‌బాస్ వాయిస్ అంటే చాలా గంభీరంగా ఉండాలి. హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ అందర్నీ కంట్రోల్ చేసేలా ఉండాలి వాయిస్. అందుకే దీనికి డబ్బింగ్ ఆర్టిస్టులని తీసుకుంటారు. బిగ్‌బాస్ వాయిస్ లో వినిపించేది షో నిర్వాహకులు రాసినా చెప్పేది మాత్రం ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. మన తెలుగులో బిగ్‌బాస్ వాయిస్ ఇచ్చేది సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రేణుకుంట్ల శంకర్.

శంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎప్పుడో పదిహేనేళ్ల క్రితమే కెరీర్ మొదలుపెట్టారు. మొదట సీరియల్స్ లో పాత్రలకు డబ్బింగ్ చెప్పిన శంకర్ ఆ తర్వాత సినిమాలకు కూడా చెప్పారు. చాలా డబ్బింగ్ సినిమాల్లో స్టార్ హీరోలకు కూడా శంకర్ డబ్బింగ్ చెప్పారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్ బచ్చన్ కి కూడా శంకర్ డబ్బింగ్ చెప్పారు. సీరియల్స్, సినిమాలకు డబ్బింగ్ చెప్పుకుంటూ వెళ్తున్న తరుణంలో బిగ్‌బాస్ షో మొదలవ్వగా చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులని ఆడిషన్ చేశారు.

Salaar : ఎట్టకేలకు ‘సలార్’ వాయిదాపై స్పందించిన చిత్రయూనిట్.. కొత్త డేట్..?

దాదాపు 100 మందికి పైగా ఆడిషన్స్ చేసి బిగ్‌బాస్ హౌస్ లో శంకర్ వాయిస్ అయితే కరెక్ట్ గా సరిపోతుందని భావించి ఆయన్ని సెలెక్ట్ చేశారు షో నిర్వాహకులు. దీంతో మొదటి సీజన్ నుంచి కూడా బిగ్‌బాస్ షోలో బిగ్‌బాస్ గా వినిపించేది ఇతని గొంతే. షో నిర్వాహకులు ఏం మాట్లాడాలి అని రాసి ఇవ్వగా ఇతను మాట్లాడతాడు. ఇక శంకర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు అవార్డులు కూడా గెలుచుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు