Bro – Baby : ఓటీటీకి వచ్చేసిన పవన్ కళ్యాణ్ ‘బ్రో’.. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘బేబీ’.. మరికొన్ని మూవీ రిలీజ్‌లు..

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమాలు. బ్రో అండ్ బేబీ ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయో తెలుసా..?

Bro Pizza 3 The Mummy slum dog husband Baby movie OTT releases

Bro – Baby : ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan), సాయిధ‌ర‌మ్‌ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కిన మెగా మల్టీస్టారర్ చిత్రం ‘బ్రో’. తమిళ్ మూవీ ‘వినోదయ సిత్తం’కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని సముద్రఖని డైరెక్ట్ చేశాడు. కేతిక శర్మ, ప్రియా వారియర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, 30 ఇయర్స్ పృథ్వి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం జులై 28న రిలీజ్ అయ్యి రాజకీయంగా పెద్ద వివాదాస్పదం అయ్యింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఓ మాదిరిగా సందడి చేసిన ఈ చిత్రం.. తాజాగా నేడు ఓటీటీలోకి వచ్చేసింది.

Gandeevadhari Arjuna Review : వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ..

నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది. మరి మెగా మామాఅల్లుళ్ళ అల్లరిని థియేటర్ లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ‘బేబీ’ కూడా ఓటీటీకి వచ్చేసింది.

Bedurulanka 2012 Review : కార్తికేయ బెదురులంక 2012 ట్విట్టర్ రివ్యూ..

ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ ద‌ర్శ‌క‌త్వంలో SKN నిర్మించిన ఈ సినిమా.. ప్రస్తుత ప్రేమ కథల ఆధారంగా తెరకెక్కి యూత్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద 70 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఆహా (Aha) లో ఈ సినిమా ప్రసారం అవుతుంది. అలాగే పిజా 3, స్లమ్ డాగ్ హస్బెండ్, లవ్ యు రామ్, సినిమాలు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు