Bhagavanth Kesari : అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఇటీవల దసరాకు వచ్చిన భగవంత్ కేసరి సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఈ సినిమాలో బాలయ్య మాస్ తో పాటు మంచి మెసేజ్, ఎమోషన్ ఉండటంతో సినిమా మరింత ఎక్కువమందికి రీచ్ అవుతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ సక్సెస్ టూర్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో దంచవే మేనత్త కూతురు సాంగ్ షూట్ చేసి, అది లేకుండానే సినిమా రిలిజ్ చేశారు. సినిమా హిట్ అయ్యాక వారం రోజుల తర్వాత ఆ పాటని థియేటర్స్ లో జత చేస్తామని తెలిపారు. తాజాగా దంచవే మేనత్త కూతురు సాంగ్ ని థియేటర్స్ లో యాడ్ చేశారు. బాలయ్య కెరీర్ లో సూపర్ హిట్ అయిన పాట దంచవే మేనత్త కూతురా. ఈ సాంగ్ రీమిక్స్ చేయడంతో అభిమానులు మరోసారి ఈ పాట కోసం థియేటర్స్ కి వెళ్తున్నారు.
Also Read : Dil Raju : టాలీవుడ్ లో మరో పెళ్లి.. దిల్ రాజు ఇంట పెళ్లి సందడి?
ఈ పాట సినిమా చివర్లో అభిమానుల కోసమే పెట్టినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ లో బాలయ్య, కాజల్ కలిసి మాస్ స్టెప్పులు వేసి అలరించారు. శ్రీలీల కూడా వీరితో కలిసి స్టెప్పులు వేసింది. కాజల్, శ్రీలీల హాఫ్ శారీలు కట్టుకొని దంచవే మేనత్త కూతురా సాంగ్ కి స్టెప్పులు వేస్తుంటే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. దీంతో ఈ పాట వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ఎన్ని రికార్డ్ బద్దలుకొడుతుందో చూడాలి.
Mass song of #BhagavanthKesari
💥💥💥💥🔥🔥🔥🔥 pic.twitter.com/HkijEZED96— Manikrishna Navuluri (@Maninavuluri) October 24, 2023