Godfather: ‘గాడ్‌ఫాదర్’లో ఆ పాత్రను లేపేశారా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అయితే మలయాళ మూవీతో పోల్చుకుంటే గాడ్‌ఫాదర్ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా బరిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను మలయాళ మూవీ లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. అయితే మలయాళ మూవీతో పోల్చుకుంటే గాడ్‌ఫాదర్ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Godfather: గాడ్‌ఫాదర్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సాలిడ్‌గా కుదిరిందట!

మలయాళ సినిమాలో మోహన్ లాల్ చేసిన పాత్రలో చిరంజీవి నటిస్తుండగా, మంజు వారియర్ నటించిన పాత్రలో నయనతార కనిపిస్తోంది. ఇక వివేక్ ఒబెరాయ్ నటించిన పాత్రలో సత్యదేవ్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. అయితే సల్మాన్ పాత్రను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొంత మార్పు చేశారు గాడ్‌ఫాదర్ చిత్ర యూనిట్. కాగా, మలయాళ వర్షన్‌లో మరో యంగ్ హీరో టోవినో థామస్ చేసిన పాత్రను తెలుగులో తొలగించినట్లుగా తెలుస్తోంది.

GodFather: చిరుతో సల్లూ భాయ్‌ స్టెప్‌లు.. గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

ఆ సినిమాలో మోహన్ లాల్ సోదరుడిగా టోవినో థామస్ నటించాడు. ఉండేది కొద్దిసేపే అయినా టోవినో పాత్ర సినిమాకు బలంగా మారింది. అయితే ఇప్పుడు తెలుగులో ఈ పాత్రను లేపేశారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాను రామ్ చరణ్, ఎన్వీ ప్రసాద్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు