Jailer records : ఆగ‌ని జైల‌ర్ రికార్డులు.. ఐదు రాష్ట్రాల్లో ఆ ఘ‌న‌త సాధించిన తొలి సినిమాగా..!

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) కు స‌రైన సినిమా ప‌డితే ఎలా ఉంటుందో అంద‌రికి మ‌రోసారి తెలిసింది. గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ లేక ఇబ్బందులు ప‌డిన ర‌జినీకాంత్ జైల‌ర్ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ క‌మ్ బ్యాక్ ఇచ్చారు.

Jailer

Jailer : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) కు స‌రైన సినిమా ప‌డితే ఎలా ఉంటుందో అంద‌రికి మ‌రోసారి తెలిసింది. గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ లేక ఇబ్బందులు ప‌డిన ర‌జినీకాంత్ జైల‌ర్ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్ క‌మ్ బ్యాక్ ఇచ్చారు. దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికి కూడా భారీ క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఎన్నో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన జైల‌ర్ సినిమా తాజాగా మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

Baby Movie : ఓటీటీలో కూడా బేబీ రికార్డ్.. ఒక్కరోజులోనే 100 మిలియన్ నిమిషాల వ్యూస్..

ఐదు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల‌కు పైగా వ‌సూళ్లూ సాధించిన తొలి నాన్ సీక్వెల్ ఇండియ‌న్ సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇప్ప‌టి వ‌ర‌కు కేజీఎఫ్ 2, బాహుబ‌లి 2 చిత్రాలు మాత్ర‌మే ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాయి. జైల‌ర్ సినిమా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో రూ.50 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.585 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించింది.

OG Teaser : అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో పవన్ OG టీజర్.. పవన్ బర్త్‌డే రోజు గూస్ బంప్స్ రావాల్సిందే..

ఈ చిత్రంలో ర‌జినీకాంత్ భార్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌గా త‌మ‌న్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, కీల‌క పాత్ర‌లు పోషించారు. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించింది. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించ‌గా ఈ సినిమాకు సీక్వెల్ ఉండ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు నెల్స‌న్ చెప్పాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో త‌లైవా అభిమానులు పుల్ హ్యాపీగా ఉన్నారు.

Allu Arjun : బ్ర‌హ్మానందం నివాసంలో బ‌న్నీ సంద‌డి.. పిక్స్ వైర‌ల్‌

ట్రెండింగ్ వార్తలు