Vinayakan : రజినీకాంత్ పై జైలర్ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రోజూ సెట్స్‌లోకి వచ్చి..

జైలర్ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్ పాత్రలో నటించిన వినాయకన్ కి కూడా బాగా గుర్తింపు వచ్చింది.

Jailer Movie Villain Vinayakan interesting comments on Rajinikanth

Vinayakan :  ఇటీవల రజినీకాంత్(Rajinikanth) జైలర్(Jailer) సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసి జైలర్ సినిమా రజిని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా విలన్ పాత్రలో నటించిన వినాయకన్ కి కూడా బాగా గుర్తింపు వచ్చింది.

ఎన్నో ఏళ్లుగా తమిళ్, మలయాళం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, కామెడీ, విలన్ వేషాలు వేసుకుంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు వినాయకన్. జైలర్ సినిమాలో రజినీకి పవర్ ఫుల్ విలన్ గా కనిపించి ఓ పక్క డ్యాన్సులు వేస్తూ మరోపక్క విలనిజం చూపించి ప్రేక్షకులని మెప్పించాడు. బక్కోడయినా రజినీకాంత్ కి ఎదురుగా విలనిజం అదరగొట్టాడు అని అంతా అభినందించారు.

AMB Cinemas : కర్ణాటకలో అతిపెద్ద థియేటర్ ఇప్పుడు మహేష్ బాబుది.. AMB సినిమాస్ త్వరలో బెంగళూరులో..

తాజాగా వినాయకన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వినాయకన్ మాట్లాడుతూ.. ప్రతిరోజు సెట్ లోకి రాగానే, నన్ను చూడగానే హగ్ చేసుకొని మాట్లాడేవాళ్ళు. ఒకవేళ నేను కనిపించకపోతే వినాయకన్ ఎక్కడ అని అడిగి పిలిచేవాళ్ళు. ఆయనతో అంత క్లోజ్ గా ఉన్నాను. అంతకంటే ఇంకేం కావాలి. నటనలో కూడా ఆయన ఎదురుగా ఇబ్బంది పడుతుంటే నీకు నచ్చినట్టు చెయ్యి అని ఫ్రీడమ్ ఇచ్చి ప్రోత్సహించారు. ఆయన నాకు దేవుడి లాంటివారు. ఆయన్ని ముప్పై ఏళ్లుగా అభిమానిస్తున్నాను. ఆయనతో ఇలా కలిసి నటించడం ఆ దేవుడి ఆశీర్వదంలా భావిస్తున్నాను అని తెలిపారు. ఇక ఈ సినిమాకు వినాయకన్ దాదాపు కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు