Janhvi Kapoor : మొన్నటిదాకా వద్దని.. ఇప్పుడేమో టాలీవుడ్ కావాలంటున్న జాన్వీ కపూర్..

బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా అక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి నానాతంటాలు పడుతోంది. ధియేటర్లో రిలీజ్ అయిన సినమాల కన్నా ఓటీటీలోనే ఎక్కువ రిలీజ్ చేసింది జాన్వి. అంతేకాదు కమర్షియల్ హీరోయిన్ కంటే కూడా.............

Janhvi Kapoor :  శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగులో సినిమాలు చెయ్యాలని, చేస్తుందని ఎప్పటినుంచో అనుకుంటున్నారు టాలీవుడ్ ఆడియన్స్ . అయితే జాన్వి మాత్రం అదుగో.. ఇదుగో అంటూ పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు రిగ్రెట్ అవుతోంది. మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ట్రై చేస్తూ హింట్ ఇస్తోంది. అతిలోక సుందరి కూతురు ఎప్పుడెప్పుడు టాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జాన్వి తెలుగులో హీరోయిన్ గా చేస్తే చూడాలని శ్రీదేవి ఫ్యాన్స్ చాలా మంది ఆశపడుతున్నారు. దానికోసం సౌత్ నుంచి భారీ ఛాన్సులు కూడా వచ్చాయి జాన్వీకి. అయితే అమ్మడు మాత్రం అప్పట్లో లైట్ తీసుకుని ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ కి రావడానికి ట్రై చేస్తోంది.

నిజానికి విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నది జాన్వీకపూర్ నే. విజయ్ తన ఫేవరెట్ హీరో అని ఫస్ట్ నుంచి చెబుతున్న జాన్వికపూర్ లైగర్ సినిమా చేస్తుందని అందరూ అనుకున్నారు. అంతేకాదు పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్ సాలిడ్ ఎంట్రీ అని ఫిక్స్ అయ్యారు. కానీ లైగర్ సినిమా చెయ్యలేదు జాన్వి. కారణాలు ఏవైనా జాన్వి వరసగా వస్తున్న టాలీవుడ్ ఆఫర్లను రిజెక్ట్ చెయ్యడంతో సౌత్ జనాలు, ఫిలిం మేకర్స్ కూడా లైట్ తీసుకున్నారు. అయితే లేటెస్ట్ గా జాన్వీయే ఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ మాత్రం వదులుకోనంటోంది.

Karthi Sequel Movies : కార్తీ 2023.. సీక్వెల్స్ నామ సంవత్సరం..

బాలీవుడ్ లో స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినా అక్కడ స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి నానాతంటాలు పడుతోంది. ధియేటర్లో రిలీజ్ అయిన సినమాల కన్నా ఓటీటీలోనే ఎక్కువ రిలీజ్ చేసింది జాన్వి. అంతేకాదు కమర్షియల్ హీరోయిన్ కంటేకూడా విమెన్ సెంట్రిక్ సినిమాల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తోంది. దాంతో జనాలు కూడా జాన్విని లైట్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో ఎలాగూ కమర్షియల్ హీరోయిన్ కాలేకపోతోంది కాబట్టి తెలుగులో స్టార్ హీరోలతో ఛాన్సులకోసం చూస్తోంది. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదు. ఈ వేకెన్సీని ఫిల్ చెయ్యడానికి ట్రై చేస్తోంది జాన్వి. అందుకే ఎన్టీఆర్ తో సినిమాఛాన్సొస్తే అస్సలు వదులుకోనంటోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇదే చెప్పి టాలీవుడ్ రావడానికి రెడీ అని హింట్ ఇచ్చింది జాన్వీ కపూర్.

ట్రెండింగ్ వార్తలు