KH233 : మెషిన్ గన్స్‌తో కమల్ హాసన్ స్పెషల్ ట్రైనింగ్.. వీడియో వైరల్..

హెచ్‌ వినోథ్‌ తో చేయబోయే KH233 మూవీ కోసం మెషిన్ గన్స్‌తో కమల్ హాసన్ స్పెషల్ ట్రైనింగ్..

Kamal Haasan weapon training for H Vinoth KH233 movie

KH233 : ‘విక్ర‌మ్’ (Vikram) చిత్రంతో భారీ కమ్‌బ్యాక్ ఇచ్చిన క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan).. వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ వెళ్తున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 (Indian 2) ని మొదలుపెట్టిన కమల్.. దానిని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక ఈ చిత్రంతో పాటు ప్రభాస్ కల్కి (Kalki2898AD) లో కూడా నటిస్తున్నాడు. అలాగే తమిళ్ ద‌ర్శ‌కుడు హెచ్‌ వినోథ్‌ (H Vinoth) దర్శకత్వంలో తన 233వ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Kalki 2898 AD : ప్ర‌భాస్ కల్కి 2898 AD లో రామ్‌గోపాల్ వ‌ర్మ‌..? ఇప్ప‌టికే ఆర్‌జీవీ షూటింగ్ పార్ట్ పూర్తి..?

కాగా ద‌ర్శ‌కుడు హెచ్‌ వినోథ్‌.. గతంలో ఖాకి, వలిమై, తెగింపు వంటి యాక్షన్ సినిమాలను తెరకెక్కించాడు. ఇప్పుడు కమల్ తో కూడా అలాంటి ఒక యాక్షన్ ఎంటర్టైనర్ నే తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ ప్రీ ప్రొడక్షన్ లో భాగంగా కమల్ హాసన్ మెషిన్ గన్స్‌తో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పలు మెషిన్ గన్స్ తో కమల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక వీడియోని మేకర్స్ ఆడియన్స్ కి షేర్ చేశారు. ఇక ఈ వీడియోతో మూవీ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. విక్రమ్ సినిమాలో కూడా కమల్ మెషిన్ గన్స్ తో చేసిన యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలైట్ గా నిలిచాయి.

Prashanth Neel : కుటుంబసభ్యుల పేరులతో పాటు ‘సలార్’ పేరుని కూడా.. ప్రశాంత్ నీల్ వీడియో వైరల్..

ఇప్పుడు ఈ మూవీలో కూడా ఆ రేంజ్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. తన హోం బ్యాన‌ర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌పై కమల్‌ హాసన్‌ అండ్ ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘రైజ్‌ టు రూల్’ అనే ట్యాగ్‌లైన్‌ తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో నటించే నటీనటులు గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇండియన్ 2 షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లు సమాచారం ప్రస్తుతం ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఆ మూవీ రిలీజ్ డేట్ పై అనౌన్స్ రానుంది.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు