Naatu Naatu : టెస్లా కార్స్ నాటు నాటు ఆడితే ఎలా ఉంటుందో చూశారా?

ఇప్పటి వరకు మనుషులు నాటు నాటు (Naatu Naatu) ఆడుతుంటే ఎలా ఉంటుందో చూశారు. కానీ కారులు నాటు నాటు ఆడితే ఎలా ఉంటదో చూశారా?

Naatu Naatu : ఆస్కార్ (Oscar) గెలిచిన తరువాత కూడా ‘నాటు నాటు’ (Naatu Naatu) హంగామా అసలు తగ్గడం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR లోని ఈ పాట ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. తెలుగు పాటలోని జోష్ ఏంటో పాప్ సంగీత ప్రపంచానికి ఎం ఎం కీరవాణి ఈ పాటతో తెలియజేశాడు. సాధారణ ప్రజలు మాత్రమే కాదు ఉన్నత అధికారులు కూడా నాటు నాటుకి చిందేయకుండా ఉండలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొరియన్ ఎంబసీ (Korean Embassy) మరియు జర్మన్ ఎంబసీ (Germany Embassy) అధికారులు నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి ఇరగదీశారు.

Naatu Naatu : మొన్న కొరియన్, నేడు జర్మన్ ఎంబసీ.. నాటు నాటు పై ఆనంద్ మహేంద్ర ట్వీట్!

అయితే ఇప్పటి వరకు నాటు నాటు పాటకి మనుషులు మాత్రమే ఆడారు. కానీ కారులు నాటు నాటు ఆడితే ఎలా ఉంటదో చూశారా? న్యూ జెర్సీలోని అభిమానులు అంతా కలిసి నాటు నాటు ఆస్కార్ గెలుచుకున్నందుకు సరి కొత్తగా అభినందనలు తెలియజేశారు. తమ టెస్లా (Tesla) కార్స్ హెడ్ లైట్స్ తో నాటు నాటు సాంగ్ బీట్ ని సింక్ చేస్తూ లైట్ షో చేశారు. చూడడానికి ఆ షో చాలా బాగుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ ఆర్ఆర్ఆర్ టీం కూడా థాంక్యూ చెప్పింది.

Naatu Naatu : RC15 సెట్‌లో ప్రభుదేవా 100 మంది డాన్సర్స్‌తో కలిసి నాటు నాటు స్టెప్..

కాగా ఇంకో నాలుగు రోజుల్లో (మార్చి 24) RRR రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అవుతుంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి పాన్ వరల్డ్ సక్సెస్ అందుకొని హాలీవుడ్ మార్కెట్ లోకి ఇండియన్ సినిమాలకు ఒక దారిని వేసింది. ఈ క్రమంలోనే చరణ్, ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలు చూస్తున్నారు. ఇక రాజమౌళి అయితే తన తదుపరి సినిమాని ఏకంగా హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో కలిసి తెరకెక్కించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు