Rajat patidar : సిక్సర్ల మోత మోగించిన ఆర్సీబీ బ్యాటర్ పాటిదార్.. 14ఏళ్ల రికార్డు సమం

20 బంతులు ఆడిన రజత్ పాటిదార్ రెండు ఫోర్లు, ఐదు సిక్సుల సాయంతో 50 పరుగులు చేశాడు. 11వ ఓవర్లో స్పిన్నర్ మయాంక్ మార్కండే వేసిన బౌలింగ్ లో

SRH vs RCB : ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌‌‌రైజర్స్ హైదరాబాద్‌ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బ్యాటర్లు విరాట్ కోహ్లీ (51), రజత్ పాటిదార్ (50) రాణించారు.

Also Read : SRH vs RCB : బెంగళూరుకు రెండో విజయం.. హైదరాబాద్‌పై 35 పరుగుల తేడాతో గెలుపు
20 బంతులు ఆడిన రజత్ పాటిదార్ రెండు ఫోర్లు, ఐదు సిక్సుల సాయంతో 50 పరుగులు చేశాడు. 11వ ఓవర్లో స్పిన్నర్ మయాంక్ మార్కండే వేసిన బౌలింగ్ లో వరుసగా నాలుగు సిక్సులు కొట్టి ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 11వ ఓవర్లో రెండో బంతికి రజత్ పాటిదార్ లాంగ్ ఆఫ్ లో 86 మీటర్ల సిక్స్ కొట్టాడు. మూడో బంతికి కూడా సిక్స్ కొట్టాడు. నాల్గో బంతిని మార్కండే గూగ్లీని వేశాడు.. దానిని పాటిదార్ బౌండరీ బయటకు డీప్ మిడ్ వికెట్ వైపు పంపాడు. అదే సమయంలో డీప్ ఎక్స్ ట్రా కవర్ లో నాల్గో సిక్స్ కొట్టాడు. దీంతో 11వ ఓవర్లో ఏకంగా 27 పరుగులు రాబట్టారు.

Also Read : RCB Playoffs Chances : సన్‌రైజర్స్ జట్టుపై విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు మెరుగయ్యాయా..

రజత్ పాటిదార్ 19 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ జట్టు తరపున అత్యంత వేగవంతమైన ఆఫ్ సెంచరీ చేసిన మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప రికార్డును రజత్ పాటిదార్ సమం చేశాడు. 2010 మార్చి 16న బెంగళూరులో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఉతప్ప 19 బంతుల్లో ఆఫ్ సెంచరీ చేశాడు.

2013లో 17బంతుల్లో క్రిస్ గేల్ ఆఫ్ సెంచరీ (పూణె వారియర్స్ జట్టుపై) చేశాడు.
2010లో 19 బంతుల్లో రాబిన్ ఉతప్ప ఆఫ్ సెంచరీ (పంజాబ్ కింగ్స్ జట్టుపై) చేశాడు.
2024లో 19 బంతుల్లో రజత్ పాటిదార్ ఆఫ్ సెంచరీ (సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై) చేశాడు.
2012లో 21బంతుల్లో ఏబీ డివిలియర్స్ ఆఫ్ సెంచరీ (జైపూర్ జట్టుపై) చేశాడు.
2024లో 21 బంతుల్లో రజత్ పాటిదార్ ఆఫ్ సెంచరీ (కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుపై) చేశాడు.

ట్రెండింగ్ వార్తలు