SRH vs RCB : బెంగళూరుకు రెండో విజయం.. హైదరాబాద్‌పై 35 పరుగుల తేడాతో గెలుపు

SRH vs RCB : సన్‌‌‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

SRH vs RCB : బెంగళూరుకు రెండో విజయం.. హైదరాబాద్‌పై 35 పరుగుల తేడాతో గెలుపు

RCB won 35 runs

SRH vs RCB : ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సన్‌‌‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరాజయం పాలైంది. ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (31) పరుగులకే చేతులేత్తేయగా, కెప్టెన్ పాట్ కమిన్స్ (31), షబాజ్ అహ్మద్ (40 నాటౌట్), భువనేశ్వర్ కుమార్ (13), అబ్దుల్ సమద్ (10), నితీష్ కుమార్ రెడ్డి (13) పరుగులతో రాణించారు.

మిగతా ఆటగాళ్లలో ఐడెన్ మార్ర్కామ్ (7), ట్రావిస్ హెడ్ (1), హెన్రిచ్ క్లాసెస్ (7), జయదేవ్ ఉనద్కత్ (8 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కామెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, విల్ జాక్స్, యశ్ దయాళ్ తలో వికెట్ తీసుకున్నారు. బెంగళూరు బ్యాట్స్‌మన్ రజత్ పాటిదార్ (50/20)తో హాఫ్ సెంచరీ నమోదు చేయగా అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

టాప్ 3లో హైదరాబాద్ :
పాయింట్ల పట్టికలో బెంగళూరు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 7 ఓడి మొత్తం 4 పాయింట్లతో అట్టడుగు స్థానంలో 10వ స్థానంలో కొనసాగుతోంది. హైదరాబాద్ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 3 ఓడి 10 పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతోంది.

హైద‌రాబాద్ టార్గెట్ 207
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 206 ప‌రుగులు చేసింది. ఆర్‌సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్‌), ర‌జ‌త్ పాటిదార్ (50; 20 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఆఖ‌ర్లో కామెరూన్ గ్రీన్ (37 నాటౌట్; 20 బంతుల్లో 5 ఫోర్లు) వేగంగా ఆడాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ మూడు వికెట్లు తీశాడు. న‌ట‌రాజ‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మ‌యాంక్ మార్కండే, పాట్ క‌మిన్స్ చెరో వికెట్ సాధించారు.

కోహ్లి ఔట్‌.. 
జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ బౌలింగ్‌లో అబ్దుల్ స‌మ‌ద్ క్యాచ్ అందుకోవ‌డంతో విరాట్ కోహ్లి (51;43 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో 14.5వ ఓవ‌ర్‌లో 140 ప‌రుగుల వ‌ద్ద ఆర్‌సీబీ నాలుగు వికెట్లు కోల్పోయింది.

కోహ్లి హాఫ్ సెంచ‌రీ..
షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 37 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

ర‌జ‌త్ పాటిదార్ హాఫ్ సెంచ‌రీ..ఆ వెంట‌నే ఔట్‌
జ‌య‌దేవ్ ఉనాద్క‌త్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 19 బంతుల్లో ర‌జ‌త్ పాటిదార్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స‌ర్లు ఉన్నాయి. ఆ మ‌రుస‌టి బంతికే అబ్దుల్ స‌మ‌ద్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 12.4వ ఓవ‌ర్‌లో 130 ప‌రుగుల వ‌ద్ద ఆర్‌సీబీ మూడో వికెట్ కోల్పోయింది.

ర‌జ‌త్ పాటిదార్ విధ్వంసం.. 4 బంతుల్లో నాలుగు సిక్స‌ర్లు..
ఎట్ట‌కేల‌కు ర‌జ‌త్ పాటిదార్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. ఇన్నింగ్స్ 11 ఓవ‌ర్‌ను మ‌యాంక్ మార్కండేయ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో ర‌జ‌త్ వ‌రుస‌గా నాలుగు బంతుల్లో నాలుగు సిక్స‌ర్లు బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 27 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 121/2. విరాట్ కోహ్లి (43), ర‌జ‌త్ పాటిదార్ (46) క్రీజులో ఉన్నారు.

విల్ జాక్స్ క్లీన్ బౌల్డ్‌.. 
బెంగ‌ళూరు మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌యాంక్ మార్కండేయ బౌలింగ్‌లో విల్ జాక్స్ (6) క్లీన్‌బౌల్ట్ అయ్యాడు. దీంతో 6.6వ ఓవ‌ర్‌లో 65 ప‌రుగుల వ‌ద్ద ఆర్‌సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు స్కోరు 65/2. ర‌జ‌త్ పాటిదార్ (0), కోహ్లి (34) లు ఆడుతున్నారు.

డుప్లెసిస్ ఔట్‌.. 
దూకుడుగా ఆడుతున్న డుప్లెసిస్ (25; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఔట్ అయ్యాడు. టి.న‌జ‌రాజ‌న్ బౌలింగ్‌లో మార్క్ర‌మ్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 3.5వ ఓవ‌ర్‌లో 48 ప‌రుగుల వ‌ద్ద బెంగ‌ళూరు మొద‌టి వికెట్ కోల్పోయింది. 4 ఓవ‌ర్ల‌కు స్కోరు 49/1. విల్ జాక్స్ (1), కోహ్లి (23) క్రీజులో ఉన్నారు.

తొలి బంతికే కోహ్లి ఫోర్‌..
ఓపెన‌ర్లుగా కోహ్లి, డుప్లెసిస్ వ‌చ్చారు. మొద‌టి ఓవ‌ర్‌ను అభిషేశ్ శ‌ర్మ వేశాడు. తొలి బంతిని కోహ్లి ఫోర్‌గా మ‌లిచాడు. 1 ఓవ‌ర్‌కు ఆర్‌సీబీ స్కోరు 10/0. కోహ్లి (8), డుప్లెసిస్ (2) లు క్రీజులో ఉన్నారు.

బెంగళూరు తుది జట్టు :
విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్‌, రజత్‌ పటిదార్‌, కామెరూన్‌ గ్రీన్‌, దినేశ్ కార్తిక్‌, మహిపాల్ లామ్రోర్, కర్ణ్‌ శర్మ, లాకీ ఫెర్గూసన్, మహ్మద్‌ సిరాజ్, యశ్ దయాల్.

హైదరాబాద్‌ తుది జట్టు :
అభిషేక్ శర్మ, ఐదెన్ మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్, నితీశ్ కుమార్‌ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్‌, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్‌ కుమార్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, మయాంక్ మార్కండే, నటరాజన్‌.

ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగ‌ళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.