RCB Playoffs Chances : సన్‌రైజర్స్ జట్టుపై విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు మెరుగయ్యాయా..

ఆర్సీబీ జట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లేఆఫ్ కు చేరడం కష్టతరమైనప్పటికీ.. మిగిలిన మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే అవకాశం ఉంటుంది.

SRH vs RCB : ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్‌‌‌రైజర్స్ హైదరాబాద్‌ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య గురువారం రాత్రి మ్యాచ్ జరిగింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ జట్టుకు ఈసీజన్ లో రెండో గెలుపు. దీంతో పాయింట్ల పట్టికలో తొమ్మిది మ్యాచ్ లు ఆడిన జట్టు నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.

Also Read : SRH vs RCB : బెంగళూరుకు రెండో విజయం.. హైదరాబాద్‌పై 35 పరుగుల తేడాతో గెలుపు

హైదరాబాద్ జట్టుపై ఆర్సీబీ జట్టు విజయం సాధించడంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగానే ఉంచుకుంది. ఆర్సీబీ జట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లేఆఫ్ కు చేరడం కష్టతరమైనప్పటికీ.. మిగిలిన మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు తొమ్మిది మ్యాచ్ లు ఆడింది.. మరో ఐదు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. మిగిలిన అన్ని మ్యాచ్ లలో విజయం సాధిస్తే 14 పాయింట్లను సొంతం చేసుకుంటుంది. దీనికితోడు మెరుగైన రన్ రేటు కూడా ఉండాలి. మిగిలిన జట్ల ఆటతీరుపైనా ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి.

Also Read : Navjot Singh Sidhu : ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాలంటే.. ఈ విష‌యంలో అస్స‌లు రాజీ ప‌డొద్దు : నవజ్యోత్ సింగ్ సిద్ధూ

ఆర్సీబీ జట్టు ఇంకా గుజరాత్ టైటాన్స్ తో రెండు సార్లు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తో ఆడాల్సి ఉంది. ఆ జట్లపై విజయం నమోదు చేయడం అంత తేలికేంకాదు. ఆర్సీబీ వచ్చే ఐదు మ్యాచ్ లలో మంచి రన్ రేట్ తో విజయం సాధిస్తే, అప్పటికీ అదృష్టం కలిసొస్తే ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు