Navjot Singh Sidhu : ప్రపంచకప్ గెలవాలంటే.. ఈ విషయంలో అస్సలు రాజీ పడొద్దు : నవజ్యోత్ సింగ్ సిద్ధూ
ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.

Rahul Dravid To Make Surprise Inclusions In Team India Squad
Navjot Singh Sidhu -Rahul Dravid : ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. కాగా.. ఈ నెలాఖరులోగా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. జట్టులో ఎవరెవరు చోటు దక్కించుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2007లో భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. మళ్లీ ఇంత వరకు మరోసారి సొంతం చేసుకోలేదు. ఈ సారి ఎలాగైనా కప్ గెలవాలని అభిమానులతో పాటు ఆటగాళ్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్టర్లకు పలు కీలక సూచనలు చేశాడు.
ఎట్టి పరిస్థితుల్లో బౌలర్ల ఎంపికలో రాజీ పడొద్దని చెప్పాడు. అదనంగా ఓ బ్యాటర్‌ను తీసుకోవాలని అనుకుంటే ఫలితాలు విభిన్నంగా వచ్చే అవకాశం ఉందన్నాడు. టీమ్ఇండియా ప్రపంచకప్ గెలవాలని భావిస్తే కనీసం ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగాలని చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజా ఉండాలని, మయాంక్ యాదవ్ ఫిట్‌గా ఉంటే తీసుకోవాలని సూచించాడు.
Bismah Maroof : వెస్టిండీస్ పై ఘోర పరాజయం.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం..
పేసర్లు ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్, మోసిన్ ఖాన్ జట్టుతో ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. అదనపు బ్యాటర్ వల్ల టోర్నీలు గెలవలేమని, ఉన్న వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నాడు. ఇప్పటి వరకు ప్రపంచకప్‌లు గెలిచిన జట్లను పరిశీలిస్తే.. అత్యత్తుమ బౌలింగ్ ఆప్షన్లతో ఆయా కెప్టెన్లు బరిలోకి దిగారని చెప్పుకొచ్చాడు. బౌలర్ల పాత్ర చాలా కీలకమన్నాడు.