హైదరాబాద్ సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ హావభావాలు మరోసారి వైరల్
RCB vs SRH: ఆమె అంతలా, విచిత్రంగా స్పందిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది.
- T Venkateshwarlu
- Published on- April 26, 2024 / 07:55 AM IST
@BreatheKohli
హైదరాబాద్ సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ హావభావాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. గత మ్యాచుల్లో వరుసగా భారీ స్కోరు చేసి అదరగొట్టిన హైదరాబాద్ సన్‌రైజర్స్ గురువారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచులో మాత్రం ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ జట్టు వెనువెంటనే వికెట్లు కోల్పోతున్న వేళ కావ్య ఆశ్చర్యపోతూ, చిరాకుపడుతూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై నెటిజన్లు మీమ్‌లు కూడా సృష్టిస్తున్నారు.
కావ్య మారన్ హావభావాలు పదే పదే వైరల్ అవుతుంటాయి. ఆమె అంతలా, విచిత్రంగా స్పందిస్తున్న తీరు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. గత మ్యాచుల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ బ్యాటర్లపై కూడా మీమ్స్ వచ్చాయి. ఇదెక్కడి వీరబాదుడు అంటూ నెటిజన్లు మీమ్స్ సృష్టించారు. ఉప్పల్ మ్యాచులో హైదరాబాద్ జట్టు మరింత రెచ్చిపోతుందని అనుకుంటే ఓటమిని మూటగట్టకుంది.
కాగా, హైదరాబాద్ జట్టుపై బెంగళూరు గెలవడంతో దీనిపై ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ మాట్లాడుతూ.. తమలో విశ్వాసాన్ని నింపేది ఇటువంటి ప్రదర్శనలు మాత్రమేనని తెలిపాడు. పోటీ చాలా తీవ్రంగా ఉందని, జట్లు చాలా బలంగా ఉన్నాయని చెప్పాడు. ఆటగాళ్లు 100 శాతం సమర్థతతో ఆడకుంటే దెబ్బతింటారని అన్నాడు.
Also Read : సన్‌రైజర్స్ జట్టుపై విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు మెరుగయ్యాయా..
