Ustaad Bhagat Singh : ఉస్తాద్‌ ఈజ్ బ్యాక్ ఇన్‌ యాక్షన్‌.. ప‌వ‌న్ అభిమానుల‌కు పండ‌గే..!

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ (Harish Shankar) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

USTAAD is back in action

Ustaad Bhagat Singh update : ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి హరీష్ శంకర్ (Harish Shankar) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగా.. తాజాగా రెండ‌వ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభ‌మైంది.

Naa Saami Ranga : నాగార్జున సినిమాలో అల్లరి నరేష్.. స్నేహితుడు పాత్ర కోసమేనా..?

తాజా షూటింగ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాల్గొన్నారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఈ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ షూటింగ్‌లో భాగం అయ్యారు. ఈ షెడ్యూల్‌లో ఆయ‌న‌పై కీల‌క సన్నివేశాల‌ను తెర‌కెక్కించ‌నున్న‌ట్లు చెప్పింది. కొత్త‌  పోస్ట‌ర్‌లో ప‌వ‌ర్ స్టార్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నాడు. కుర్చీలో కూర్చోని గ‌న్ ప‌ట్టుకుని ఉన్న ప‌వ‌న్ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

KH233 : మెషిన్ గన్స్‌తో కమల్ హాసన్ స్పెషల్ ట్రైనింగ్.. వీడియో వైరల్..

‘గ‌బ్బ‌ర్ సింగ్’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత ప‌వ‌న్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు