Raviteja: మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథ రావు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో రవితేజ యంగ్ బ్యూటీ శ్రీలీలతో రొమాన్స్ చేస్తున్నాడు. రవితేజ లాంటి సీనియర్ హీరో శ్రీలీల లాంటి యంగ్ బ్యూటీతో రొమాన్స్ చేస్తున్నాడనే విషయం టాలీవుడ్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే, రవితేజ మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ చేసేందుకు రెడీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Raviteja Next Movie: మరోసారి ఆ డైరెక్టర్‌తో చేతులు కలుపుతున్న రవితేజ.. ఎవరంటే?
రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు ‘ఈగల్’ అనే టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను హీరోయిన్గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ లెక్కన మరో యంగ్ బ్యూటీతో మాస్ రాజా రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Raviteja Next Movie Titled Eagle: మరో క్రేజీ ప్రాజెక్టుకు మాస్ రాజా రెడీ.. టైటిల్ కూడా క్రేజీయే!
తనకంటే వయసులో చాలా జూనియర్స్ అయిన బ్యూటీలతో ఇలా మాస్ రాజా వరుసగా రొమాన్స్ చేస్తుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమాలో నిజంగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుందా, లేక వేరే ఎవరినైనా హీరోయిన్గా తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.