Vaishnavi Chaitanya : ఆ ఇద్దరు హీరోల సినిమా ఛాన్స్ అందుకున్న వైష్ణవి.. నిజమేనా..?

బేబీ సక్సెస్ తో వైష్ణవి తేజ్ వద్దకు క్రేజ్ ఆఫర్లు వస్తున్నాయట. తాజాగా రెండు బడా నిర్మాణ సంస్థల నుంచి..

Vaishnavi Chaitanya got heroine chance in Siddu Jonnalagadda and Ashis movies

Vaishnavi Chaitanya : షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి చైతన్య.. ఎంతో కష్టపడి నేడు హీరోయిన్ గా తనని వెండితెర పై చూసుకుంది. బేబీ (Baby) సినిమాలో హీరోయిన్ గా నటించి ఆడియన్స్ తో పాటు దర్శకనిర్మాతల దృష్టిని కూడా ఆకర్షించింది. మొదటి సినిమాలోనే ఒక బలమైన పాత్రని ఎంచుకొని నటిగా తాను ఏంటో అందరికి ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమాలో వైష్ణవి నటన చూసిన అల్లు అరవింద్.. తనతో ఒక సినిమా చేస్తాను అంటూ స్టేజి పైనే చెప్పుకొచ్చాడు.

Kaavaali Video Song : జైలర్ నుంచి ‘కావాలి’ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఒక లుక్ వేసేయండి..

తాజాగా వైష్ణవి రెండు బడా నిర్మాణ సంస్థలు నుంచి ఆఫర్లు అందుకుంది. వాటిలో ఒక బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాణంలో తెరకెక్కబోతున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) మూవీ అని తెలుస్తుంది. ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు ఒక సినిమాని ఓపెన్ చేశాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. హీరోయిన్ గా వైష్ణవిని సెలెక్ట్ చేశారట. అలాగే దిల్ రాజు నిర్మించబోయే సినిమాలో కూడా వైష్ణవిని కథానాయకిగా ఎంపిక చేసినట్లు సమాచారం.

Manchu Manoj : మంచు మనోజ్ రీ ఎంట్రీ వెండితెర పై కాదా..? బుల్లితెర మీదనా..!

అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో ‘ఆశిష్‌’ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో వైష్ణవిని హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారట. ఇందుకు వైష్ణవి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇలా రెండు నిర్మాణ సంస్థల్లో వైష్ణవి రెండు క్రేజ్ ప్రాజెక్ట్స్ అందుకున్న విషయం ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే మూవీ టీమ్స్ నుంచి మాత్రం ఈ విషయం పై అధికారిక ప్రకటన రాలేదు. కాగా హీరో రామ్, పూరీజగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) లో కూడా వైష్ణవి అవకాశం అందుకున్నట్లు సమాచారం. అందుకనే బేబీ సక్సెస్ సమయంలో రామ్, వైష్ణవికి ప్రత్యేకంగా ఒక పుష్పగుచ్ఛాన్ని పంపించి కంగ్రాట్యులేట్ చేశాడు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు