Birth Certificate: అక్టోబర్ 1 తర్వాత పూర్తిగా మారిపోనున్న సీన్.. ఇక నుంచి అన్నింటికీ బర్త్ సర్టిఫికెటే కావాలి

ఈ చట్టం రిజిస్టర్డ్ జనన మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్‌లను నియమిస్తాయి

Births and Deaths (Amendment) Act 2023: జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023.. వచ్చే నెల (అక్టోబర్) 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రాబోతోంది. అంటే ఇక నుంచి బర్త్ సర్టిఫికేట్ ప్రాముఖ్యత చాలా పెరగనుంది. ఈ సర్టిఫికేట్ పాఠశాల, కళాశాల అడ్మిషన్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు, ఓటరు జాబితాలో పేరు చేర్చడం, ఆధార్ నమోదు, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తు కోసం ఇలా అన్నింటికీ తప్పనిసరి కానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంటు ఉభయ సభలు గత నెలలో ముగిసిన వర్షాకాల సమావేశాల్లో జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ని ఆమోదించాయి.

ఈ నిబంధన అక్టోబర్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది
జనన మరణ నమోదు (సవరణ) చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, ఆధార్ నుంచి అవసరమైన అన్ని ప్రభుత్వ పత్రాలను తయారు చేయడంలో జనన ధృవీకరణ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఈ బిల్లు లోక్‌సభలో ఆగస్టు 1న, రాజ్యసభలో ఆగస్టు 7న ఆమోదం పొందింది. అనంతరం, తాజాగా కేంద్ర ప్రభుత్వం దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

చీఫ్ రిజిస్ట్రార్‌ను నియమిస్తారు
ఈ చట్టం రిజిస్టర్డ్ జనన మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు చీఫ్ రిజిస్ట్రార్, రిజిస్ట్రార్‌లను నియమిస్తాయి. ఈ అధికారులు జాతీయ డేటాబేస్‌లో నమోదైన జననాలు, మరణాల డేటాను భాగస్వామ్యం చేయడానికి బాధ్యత వహిస్తారు. చీఫ్ రిజిస్ట్రార్ రాష్ట్ర స్థాయిలో ఏకరూప డేటాబేస్‌ను సిద్ధం చేస్తారు.

Sanjay Raut: పాకిస్తాన్‭తో గొడవ అయితే క్రికెట్ మ్యాచ్ ఆడొద్దట.. జమ్మూ కశ్మీర్ కాల్పులపై సంజయ్ రౌత్ వాదన

నమోదిత జననాలు, మరణాల కోసం జాతీయ, రాష్ట్ర స్థాయి డేటాబేస్‌లను ఏర్పాటు చేయడం బిల్లు ప్రధాన లక్ష్యం. ఈ చొరవ ఇతర డేటాబేస్‌ల కోసం అప్‌డేట్ ప్రాసెస్‌లను మెరుగుపరుస్తుందని, సమర్థవంతమైన, పారదర్శకమైన పబ్లిక్ సర్వీసులు, సోషల్ బెనిఫిట్ డెలివరీని ప్రోత్సహిస్తుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరపున కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత, జనన నమోదు సమయంలో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ నంబర్ అవసరం అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు