Deoghar airport row: జార్ఖండ్ ఐఏఎస్ అధికారిపై దేశద్రోహం కేసు ఫైల్ చేసిన బీజేపీ ఎంపీ

కొత్తగా ప్రారంభించబడిన విమానాశ్రయం కావ‌డంతో రాత్రి కార్యకలాపాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఎఫ్‌ఐఆర్‌పై నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. విమానాశ్రయం అథారిటీ అభ్యంతరం చెప్పలేదని, తాము ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ నుండి అనుమతి తీసుకున్నామని అయినప్పటికీ తమకు అనుమతి ఇవ్వకపోవడమేంటని అన్నారు. తాను ఈ కేసుపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని నిషికాంత్ పేర్కొన్నారు.

Deoghar airport row: జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో చార్టర్డ్ ఫ్లైట్‌ను రాత్రి టేకాఫ్ తీసుకునే అంశమై చెలరేగిన వివాదం మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీలపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అయితే నిశికాంత్ దూబే రివర్స్ అటాక్ ప్రారంభించారు. తమపై కేసు నమోదు కావడానికి కారణమైన దేవ్‌గఢ్ జిల్లా కలెక్టర్ మంజునాథ్ భజంత్రిపై ఏకంగా సెక్షన్ 124(ఏ) దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన అక్కడే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. అది సాయంత్రం నాటికి జార్ఖండ్ పోలీసులకు అందనుంది.

కాగా, దీనికి ముందు డియోఘర్ విమానాశ్రయంలో తమ చార్టర్డ్ ఫ్లైట్‌ను రాత్రి టేకాఫ్ కోసం క్లియ‌రెన్స్ చేయ‌మ‌ని అధికారులను బలవంతం చేసినందుకు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, గొడ్డా నియోజకవర్గ ఎంపీ నిశికాంత్ దూబే, ఆయన కుమారులు కనిష్క్ కాంత్, మహీకాంత్, ఎంపీ మనోజ్ తివారీ, ముకేశ్ పాఠక్, దేవతా పాండే, పింటూ తివారీ దేవ్‌గఢ్ విమానాశ్రయంలోని హై సెక్యూరిటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‭(ఏటీసీ)లోకి చొరబడి తమ చార్టర్డ్ విమానానికి అనుమతి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేశారు.

అయితే, కొత్తగా ప్రారంభించబడిన విమానాశ్రయం కావ‌డంతో రాత్రి కార్యకలాపాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఎఫ్‌ఐఆర్‌పై నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. విమానాశ్రయం అథారిటీ అభ్యంతరం చెప్పలేదని, తాము ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ నుండి అనుమతి తీసుకున్నామని అయినప్పటికీ తమకు అనుమతి ఇవ్వకపోవడమేంటని అన్నారు. తాను ఈ కేసుపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని నిషికాంత్ పేర్కొన్నారు.

Minister Gudivada Amarnath : ఎన్నికలకు ముందే మూడు రాజధానులు.. పొలిటికల్ హీట్ పెంచిన మంత్రి వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు