Boycott Amazon: అభ్యంతరకర కృష్ణుడి చిత్రాలు అమ్ముతున్న అమెజాన్.. బాయ్‌కాట్ చేస్తామంటున్న నెటిజన్స్

అమెజాన్ సంస్థకు హిందూ సంస్థల సెగ తగిలింది. అభ్యంతరకరంగా ఉన్నశ్రీ కృష్ణుడి చిత్రాల్ని వికయిస్తున్నందుకుగాను, ఆ సంస్థను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. హిందూ సంస్థలు అమెజాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Boycott Amazon: ట్విట్టర్‌లో తాజాగా బాయ్‌కాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండవుతోంది. దీనికి కారణం.. అభ్యంతరకరంగా ఉన్న శ్రీ కృష్ణుడి చిత్రాల్ని ఆ సంస్థ విక్రయించడమే. అమెజాన్ సంస్థ తన ప్లాట్‌ఫామ్‌పై శ్రీ కృష్ణుడి చిత్రాల్ని విక్రయిస్తోంది. జన్మాష్టమి సందర్భంగా ప్రత్యేకంగా కొన్నింటిని ఆన్‌లైన్‌లో సేల్ చేస్తోంది.

Landlords Murder: మందు తాగొద్దన్నందుకు ఇంటి యజమాని హత్య.. మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకున్న నిందితుడు

అయితే, ఆ చిత్రం అభ్యంతరకరంగా ఉంది. రాధాకృష్ణులు ఉన్న ఆ చిత్రంలో అశ్లీలత కనిపిస్తోంది. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ‘హిందూ జన జాగృతి సమితి’ అనే సంస్థ ఈ అంశంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చిత్రాల్ని విక్రయిస్తున్న అమెజాన్ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే ఈ చిత్రాల విక్రయాల్ని నిలిపి వేయాలని డిమాండ్ చేసింది. అమెజాన్ సంస్థతోపాటు ‘ఎక్సోటిక్ ఇండియా’ అనే మరో సంస్థ కూడా ఆన్‌లైన్‌లో వీటిని విక్రయిస్తోంది. అయితే, హిందూ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ రెండు సంస్థలూ ఈ చిత్రాల విక్రయాల్ని ఆపేశాయి.

Survey: పురుషులకంటే మహిళలకే శృంగార భాగస్వాములు ఎక్కువ… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

కానీ, ఇదొక్కటే సరిపోదని.. హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు రెండూ సంస్థలూ హిందూ సమాజానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు నెటిజన్లు కూడా అమెజాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో బాయ్‌కాట్ అమెజాన్ హ్యాష్‌టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే హిందూ సంఘాల అభ్యంతరంపై అమెజాన్ ఇంకా స్పందించలేదు.

ట్రెండింగ్ వార్తలు