Twitter Trending : చైనా వస్తువులను బ్యాన్ చేయాల్సిందే

 జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు డ్రాగన్ దేశం చైనా పదేపదే అడ్డుపడుతోంది.

  • Publish Date - March 14, 2019 / 12:20 PM IST

 జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు డ్రాగన్ దేశం చైనా పదేపదే అడ్డుపడుతోంది.

 జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు డ్రాగన్ దేశం చైనా పదేపదే అడ్డుపడుతోంది. ఐక్యరాజ్య సమితిలోని శ్వాశత సభ్యుత్వ దేశాలన్నీ ఇండియాకు సపోర్ట్ చేస్తుంటే చైనా వరుసగా నాల్గోసారి అడ్డుపడింది. డ్రాగన్ తీరుపై ఇండియా నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా వస్తువులను ఇండియాలో బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై యోగా గురూ బాబా రాందేవ్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. చైనా వస్తువులపై భారత్ లో నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Read Also : మళ్లీ చైనా అడ్డుపుల్ల : అజర్‌పై ఉగ్ర ముద్ర వేసేందుకు అభ్యంతరం

‘ఉగ్రవాది మసూద్ కు మద్దతుదారులు.. #చైనా, ఆ దేశ ప్రజలను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికపరంగా బైకాట్ చేయాలి. చైనాకు ప్రొఫిషనల్ లాంగ్వేజ్ ను మాత్రమే అర్థం చేసుకోగలదు. ఫైనాన్షియల్ బ్యాన్.. యుద్ధం కంటే ఎంతో శక్తివంతమైనది’ అని  రాందేవ్ హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. బాబా రాందేవ్ తో పాటు పలువురు నెటిజన్లు కూడా చైనా తీరును ఎండగడుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసే చైనాకు సంబంధించిన గూడ్స్ ను దేశం నుంచి బైకాట్ చేయాలని, భారతీయ పౌరులుగా ఇకపై తాము చైనా వస్తువులను కొనేది లేదని నెటిజన్లు అంటున్నారు. ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పాక్, చైనా దేశాలకు తప్పనిసరిగా గుణపాఠం చెప్సాల్సిన అవసరం ఉందని  ట్వీట్ చేశారు. 

ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటూ భారత్ గతకొంతకాలంగా ఐరాసలో గట్టిగా వాదిస్తోంది. ఈ తరుణంలో ఐరాస శాశ్వత సభ్యుత దేశాలు ఇండియాకు అనుకూలంగా స్పందించాయి. కానీ, చైనా మాత్రం ఉగ్రవాదం విషయంలో మౌనం వహిస్తూ వస్తోంది. ఉగ్రవాదం విషయంలో ఐక్యరాజ్యసమితి వేదికగా జరిగిన ఎన్నో సమావేశాల్లో భారత్ వాదనకు చైనా పరోక్షంగా తూట్లు పొడుస్తూ వస్తూనే ఉంది. చైనా వైఖరిపై భారత్ అసహనం వ్యక్తం చేస్తోంది. భారత్ వాదనను సభ్యుత్వ దేశాలన్నీ సమర్థిస్తుంటే.. చైనా మాత్రం నిరుత్సాహానికి గురిచేస్తోంది.  

ట్రెండింగ్ వార్తలు