Carpooling : కార్‌పూలింగ్‌పై నిషేధం…బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కార్‌పూలింగ్‌పై నిషేధం విధిస్తూ బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని రవాణా శాఖ కార్‌పూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించింది....

Carpooling

Carpooling : కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కార్‌పూలింగ్‌పై నిషేధం విధిస్తూ బెంగళూరు రవాణశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని రవాణా శాఖ కార్‌పూలింగ్ చట్టవిరుద్ధమని ప్రకటించింది. (Carpooling banned in Bengaluru) కార్‌పూలింగ్‌పై రూ. 10,000 వరకు జరిమానా విధిస్తామని రవాణశాఖ తెలిపింది. (fines up to Rs 10,000) నగరంలో రిజిస్టర్డ్ క్యాబ్ ఆపరేటర్లలో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించేందుకు రవాణ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Afghan embassy : భారత్‌లో అఫ్ఘాన్ రాయబార కార్యాలయం మూసివేత

దీంతో కార్‌పూలింగ్ మొబైల్ అప్లికేషన్‌ల వినియోగదారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవచ్చు. క్యాబ్స్ అసోసియేషన్ దాఖలు చేసిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా, రవాణాశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ చేయని వాహనాలను క్యాబ్‌లుగా ఉపయోగించడాన్ని నిషేధించారు. వాణిజ్య వినియోగం కోసం నమోదు చేయని తెల్లటి నంబర్ ప్లేట్‌లను వ్యాపారం కోసం క్యాబ్‌లుగా ఉపయోగించలేరని రవాణశాఖ అధికారులు చెప్పారు.

Maldives : మాల్దీవుల అధ్యక్షుడిగా మొహహ్మద్ మయిజ్జు విజయం

షేర్డ్ మొబిలిటీ సేవలను ఎంచుకునే కార్ల యజమానుల తమ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని ఆరు నెలల వరకు నిలిపివేసే అవకాశముందని అధికారులు చెప్పారు. కార్‌పూలింగ్‌పై నిషేధం విధించడంపై దీనిపై ఆధారపడిన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు