Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండర్‌ కొత్త ఫొటోలు పోస్ట్ చేసిన ఇస్రో

ఇప్పటికే జాబిల్లిపై ల్యాండర్, రోవర్ కు సంబంధించిన పలు ఫొటోలను ఇస్రో పోస్ట్ చేసింది.

Chandrayaan 3

Chandrayaan 3 – ISRO: చంద్రయాన్-2 (Chandrayaan-2) ఆర్బిటర్ తాజాగా జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండర్‌కు సంబంధించిన ఫొటోలను తీసిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తెలిపింది. ఆర్బిటర్‌లోని డ్యుయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ పరికరం సెప్టెంబరు 6న ఈ ఫొటోలు తీసిందని వివరించింది.

ఈ ఫొటోలను ఇస్రో ట్విటర్ ఖాతాతో పాటు వెబ్‌సైట్లో పోస్ట్ చేసింది. సౌర శక్తి వెలుగు లేకున్నా రాడార్ వల్ల ఫొటోలు తీయొచ్చని తెలిపింది. ఇప్పటికే జాబిల్లిపై ల్యాండర్, రోవర్ కు సంబంధించిన పలు ఫొటోలను ఇస్రో పోస్ట్ చేసింది. ఇటీవలే ఆదిత్య ఎల్‌-1 కూడా భూమితో పాటు జాబిల్లి ఫొటోలు తీసిన విషయం తెలిసిందే.

సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ఇటీవలే ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేసింది. మరోవైపు, విక్రమ్ ల్యాండర్ ను రోవర్ కూడా కొన్ని రోజుల ముందు ఫొటో తీసింది. రోవర్ లోని నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలను తీశాయి.

Chandrayaan-3 : చంద్రుడిపై ప్రజ్ఞాన్ తొలి విడత ప్రక్రియ సక్సెస్.. జాబిల్లిపై 14 రోజులు చీకటి, ప్రజ్ఞాన్ రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపిన ఇస్రో

ట్రెండింగ్ వార్తలు