Chartered Plane Skid: ముంబై రన్‭పై జారిపడి పడి రెండు ముక్కలైన చార్టర్డ్ విమానం.. హృదయాన్ని కలచివేసే వీడియో చూశారా?

ఈ విమానంలో కెప్టెన్ సునీల్, కెప్టెన్ నీల్, ధ్రువ్ కోటక్, లార్స్ సోరెన్‌సెన్ (డెన్మార్క్), కేకే కృష్ణ దాస్, ఆకర్ష్ షెథి, అరుల్ సాలి, కామాక్షి (మహిళ) ఉన్నారు. భారీ వర్షం కారణంగా ఘటన సమయంలో ఎయిర్‌పోర్టులో 700 మీటర్ల మేర కనిపించిందని డీజీసీఏ తెలిపింది

Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో భారీ వర్షం మధ్య గురువారం (సెప్టెంబర్ 14) ల్యాండింగ్ సమయంలో ఒక ప్రైవేట్ చార్టర్డ్ విమానం రన్‌వే నుంచి జారిపోయింది. ఈ విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని ఆస్పత్రిలో చేర్చినట్లు బీఎంసీ తెలిపింది. ఈ యాక్సిడెంట్‌కు సంబంధించిన ఓ వీడియో బయటికి వచ్చింది. వీఎస్‌ఆర్ వెంచర్స్‌కు చెందిన లీర్‌జెట్ 45 ఎయిర్‌క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్ విశాఖపట్నం నుంచి ముంబైకి వస్తోందని డీజీసీఏ తెలిపింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే-27లో దిగుతుండగా రన్‌వేపై జారిపోయింది.

ఈ వ్యక్తులు విమానంలో ఉన్నారు
ఈ విమానంలో కెప్టెన్ సునీల్, కెప్టెన్ నీల్, ధ్రువ్ కోటక్, లార్స్ సోరెన్‌సెన్ (డెన్మార్క్), కేకే కృష్ణ దాస్, ఆకర్ష్ షెథి, అరుల్ సాలి, కామాక్షి (మహిళ) ఉన్నారు. భారీ వర్షం కారణంగా ఘటన సమయంలో ఎయిర్‌పోర్టులో 700 మీటర్ల మేర కనిపించిందని డీజీసీఏ తెలిపింది. రన్‌వేపై నుంచి జారిపడిన అనంతరం విమానం రెండు ముక్కలైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


ఈ ప్రైవేట్ చార్టర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ కెనడాకు చెందిన బొంబార్డియర్ ఏవియేషన్ విభాగంచే తయారు చేయబడిన తొమ్మిది సీట్ల సూపర్-లైట్ బిజినెస్ జెట్. ఈ ప్రమాదం సాయంత్రం 5:02 గంటలకు జరిగిందని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్‌లో, ప్రమాదం జరిగిన రన్‌వేలో అన్ని కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయట.

ట్రెండింగ్ వార్తలు