Asaduddin Owaisi: ఒకరు చౌకీదార్, ఇంకొకరు దుకాణ్‭దార్.. మోదీ, రాహుల్ మీద ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు

వాస్తవానికి తనను తాను కాపలాదారుడినని (చౌకీదార్) ప్రధానమంత్రి తరుచూ చెప్పుకుంటారు. ఇక రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రం సందర్భంగా దుకాణం అనే పదాన్ని ఉపయోగించారు

Owaisi on PM and Rahul: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒక రీతిలో దాడి చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. మోదీయేమో చౌకీదార్ (కాపలాదారుడు), రాహులేమో దుకాణ్‭దార్ (దుకాణం నడిపేవ్యక్తి) అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు నేతలు మైనారిటీల మీద (ముఖ్యంగా ముస్లింలు) దాడులు జరుగుతుంటే.. వారికి వారే చెరొక పేర్లు పెట్టుకుని అక్కర్లేని రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Meta : ఉద్యోగులకు మెటా వార్నింగ్, మూడు రోజులు ఆఫీసుకు రాకపోతే ఉద్యోగం నుంచి ఊస్టింగ్

వాస్తవానికి తనను తాను కాపలాదారుడినని (చౌకీదార్) ప్రధానమంత్రి తరుచూ చెప్పుకుంటారు. ఇక రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రం సందర్భంగా దుకాణం అనే పదాన్ని ఉపయోగించారు. విధ్వేషం నిండిన బజార్లో ప్రేమ దుకాణాన్ని తెరుస్తున్నానని ఆయన అన్నారు. అయితే దీన్ని ఉద్దేశిస్తూ దుకాణ్‭దార్ అని ఓవైసీ ప్రయోగించారు. ‘‘ఇద్దరు నేతలు ముస్లిం మైనారిటీల గురించి పట్టించుకోరు. నరేంద్ర మోదీ రాజకీయం ఎలాంటిదో రాహుల్ గాంధీ రాజకీయం కూడా అలాంటిదే. కాకపోతే ఇద్దరి జెండాలే వేరు, అజెండా ఒక్కటే’’ అని ఓవైసీ అన్నారు.

Assam : టీచర్‌తో ఇంగ్లీషు మాట్లాడటానికి తికమక పడ్డ స్టూడెంట్స్ .. పిల్లలపై ఒత్తిడి పనికిరాదని మండిపడ్డ నెటిజన్లు

ఇక విపక్షాల ఇండియా కూటమిలో చేరికపై ఓవైసీ స్పందిస్తూ.. విపక్షాలది ప్రమాదకరమైన ప్రేమని వారితో కలిసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇక విపక్షాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మద్దతు గురించి స్పందిస్తూ.. తాము భారత్ రాష్ట్ర సమితి పెట్టిన అవిశ్వాస తీర్మాణానికి మద్దతు ఇచ్చామని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు