G20 Summit 2023: జీ20 దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో నోరూరించే రుచులు ఎన్నో ఉన్నాయి. అన్ని రకాల వంటకాలను..

G20 Summit 2023 - Delhi

G20 Summit 2023 – Droupadi Murmu: న్యూ ఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో ఆయా దేశాల నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు ఇచ్చారు. ఆమెను పలు దేశాల అధినేతలు కలిశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన విందులో నోరూరించే రుచులు ఎన్నో ఉన్నాయి. అన్ని రకాల వంటకాలను.. ప్రత్యేకంగా తయారు చేసిన వెండి పాత్రల్లో అతిథులు భుజించారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవేగౌడకు ఆహ్వానం అందినప్పటికీ ఈ విందుకు హాజరుకాలేదు.

అంతకుముందు జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీన సెల్ఫీ తీసుకున్నారు. యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ ఆదివారం ఢిల్లీలోని అక్షరధామం మందిరాన్ని దర్శించుకోనున్నారు. ఈ విషయంపై ఆయన ఇప్పటికే ప్రకటన చేశారు.

కాగా, యూకే, జపాన్ ప్రధానులతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. మొదట యూకే ప్రధాని రిషి సునక్ తో సమావేశాలు నిర్వహించి, ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

ఆ సమయంలో మోదీ, రిషి సునక్ హగ్ ఇచ్చుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాని కిషిదాతో మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. యూకే, జపాన్‌తో భారత్ పలు ఒప్పందాలపై సంతకాలు చేసింది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తోనూ మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.

G20 Summit 2023: ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు: భారత్ ప్రకటన

ట్రెండింగ్ వార్తలు