EPFO గుడ్‌న్యూస్.. గడువు పెంపు.. ఉద్యోగులకు బెనిఫిట్

EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి మరింత గడువు ఇచ్చింది. మార్చి 31 వరకు గడువు పొడిగించింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన

EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన పథకంలో రిజిస్టర్ చేసుకోవడానికి మరింత గడువు ఇచ్చింది. మార్చి 31 వరకు గడువు పొడిగించింది. ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన రిజిస్ట్రేషన్ గడువును పొడిగిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ట్విట్టర్ ద్వారా తెలిపింది.

కోవిడ్ 19 నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గర్ యోజన పథకాన్ని ఈపీఎఫ్‌వో ద్వారా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కంపెనీలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వమే నేరుగా ఉద్యోగులకు ఊరట కలిగే చర్యలు చేపట్టింది. ఈపీఎఫ్‌వో చట్టం కింద రిజిస్టర్ అయిన కంపెనీలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.

Flying Kites : మకర సంక్రాంతి పర్వదినాన గాలిపటాలను ఎందుకు ఎగరేస్తారో తెలుసా?

కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటే.. వారికి పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కేంద్రమే భరిస్తుంది. కంపెనీలు చెల్లించే 12 శాతం వాటాను ప్రభుత్వం చెల్లిస్తుంది. అలాగే ఉద్యోగి వేతనంలో కట్ అయ్యే 12 శాతం కంట్రిబ్యూషన్‌ను కూడా కేంద్ర ప్రభుత్వమే కట్టేస్తుంది. దీని వల్ల అటు కంపెనీలపై ఇటు ఉద్యోగులపై ప్రభావం పడదు.

రెండేళ్ల వరకు ఈ ప్రయోజనాన్ని కేంద్రం కల్పిస్తుంది. అయితే ఉద్యోగి వేతనం రూ. 15 వేలలోపు ఉండాలి. అప్పుడే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ వల్ల 71 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందనే అంచనాలు ఉన్నాయి. మార్చి 31లోపు ఈ స్కీమ్‌లో చేరిన వారికి మాత్రమే పథకం ప్రయోజనాలు లభిస్తాయి.

Peanuts : పల్లీలు తింటే బరువు పెరుగుతారా?

ఈ విషయం ఉద్యోగులకు శుభవార్తే అని చెప్పాలి. ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి, ఉపాధి కల్పనను పెంచడానికి, సామాజిక భద్రతా ప్రయోజనాలతో పాటు కొత్త ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి, ఉపాధి నష్టాన్ని పునరుద్ధరించడానికి ఆత్మనిర్భర్ భారత్ 3.0 ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. ABRY ప్రవేశపెట్టింది. labour.gov.inకు లాగిన్ అవడం ద్వారా ABRY గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.

* EPFOలో నమోదు చేసుకున్న అర్హత గల సంస్థల యజమానులు, కొత్త ఉద్యోగులకు ప్రోత్సాహకం లభిస్తుంది.

* కొత్త ఉద్యోగులు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి రెండేళ్ల పాటు ప్రోత్సాహకాన్ని అందుకుంటారు.

* చెల్లింపు రూపంలో ప్రోత్సాహకం అందిస్తారు.

* అక్టోబర్ 1, 2020 తర్వాత EPFOలో రిజిస్టర్ చేసిన సంస్థలు, కొత్త ఉద్యోగులందరు ప్రయోజనాలను పొందుతారు.

* EPF చట్టం 1952 కింద కొత్త ఉద్యోగులు, కొత్త సంస్థలు 31 మార్చి 2022 వరకు నమోదు చేసుకోవడానికి అర్హులు.

మరోవైపు కరోనా కష్టకాలంలో అకౌంట్‌ నుంచి లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా విత్‌ డ్రా చేసుకునే అవకాశాన్ని ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) సంస్థ అవకాశం కల్పించింది. వైరస్ బారిన పడి ఆస్పత్రిపాలైన ఉద్యోగులు ఈపీఎఫ్ఓ నుంచి మెడికల్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అత్యవసర వైద్య చికిత్స, ఆస్పత్రి ఖర్చుల కోసం ఉద్యోగులు తమ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి లక్ష రూపాయల వరకు అడ్వాన్స్‌ను కేవలం ఒక్కరోజులోనే పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్స్‌ లేకుండానే లక్ష వరకు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. కొన్ని నిబంధనలకు లోబడి పీఎఫ్‌ విత్‌ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు