Expensive Hyderabad: అదరగొట్టిన హైదరాబాద్.. ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నివాస నగరంగా రికార్డ్

గుజరాత్‌లోని అహ్మదాబాద్ భారతదేశంలో నివసించడానికి అత్యంత సరసమైన నగరంగా ఆవిర్భవించింది. సగటు కుటుంబం తన ఆదాయంలో కేవలం 23 శాతాన్ని గృహ రుణం కింద ఈఎంఐలకు కేటాయిస్తే సరిపోతుందని నివేదిక పేర్కొంది.

Expensive City Hyderabad: ప్రఖ్యాత ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన నివాస నగరంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై మొదటి స్థానంలో నిలిచింది. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఈఎంఐ-టు-ఆదాయ నిష్పత్తి ఆధారంగా ముంబై దేశంలోని అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్ టైటిల్‌ను సాధించిందని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. అయితే ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ, ఐటీ క్యాపిటల్ బెంగళూరు లాంటి నగరాలను వెనక్కి నెట్టి ముంబై తర్వాత అత్యంత ఖరీదైన నివాసయోగ్యమైన నగరాల్లో రెండవ స్థానంలో హైదరాబాద్ నిలవడం గమనార్హం.

Hyderabad Begging mafia : వృద్ధులతో భిక్షాటన చేయిస్తున్న అనిల్ .. దీంతో అతనికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా..?

నైట్ ఫ్రాంక్ నివేదిక సూచిక ఈఎంఐ స్థోమత ఆధారంగా నిర్వహించారు. అంటే గృహ రుణం కోసం ఈఎంఐల నిష్పత్తి ఆధారంగా ఒక నిర్దిష్ట నగరంలోని సగటు కుటుంబానికి చెందిన మొత్తం ఆదాయంపై ఆధారపడి జీవన స్థోమతను అంచనా వేస్తారు. ఉదాహరణకు 40 శాతం అఫర్డబిలిటీ ఇండెక్స్ ఉన్న నగరం అంటే, ఆ నగరంలోని కుటుంబాలు తమ ఆదాయంలో 40 శాతాన్ని గృహ రుణం కోసం ఈఎంఐ చెల్లించడానికి కేటాయిస్తారని అర్థం.

Uttarakhand ASP : ఫోన్‌లో మాట్లాడుతూ సీఎంకు శాల్యూట్…ఏఎస్పీపై బదిలీ వేటు

ఈ విషయంలో ముంబై నగరంలో అతి ఎక్కువగా 55 శాతం ఆదాయాన్ని గృహ రుణానికి గాను ఈఎంఐ చెల్లిస్తారని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. అంటే ఒక సగటు కుటుంబం ఇంటిని పొందడం కోసం హోమ్ లోన్ లో సగానికి పైగా ఈఎంఐకే కేటాయిస్తున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ స్థాయిలో ఈఎంఐ అంటే భరించలేనిదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే బ్యాంకులు సాధారణంగా ఇంత స్థాయి ఈఎంఐలకు తనఖాలను మంజూరు చేయడానికి వెనుకాడతాయి.

Yarlagadda Venkata Rao: యార్లగడ్డ వెంకట్రావు సంచలన నిర్ణయం.. వైసీపీకి గుడ్ బై చెప్పి, చంద్రబాబు వద్దకు..

ఇక ముంబై తర్వాత 31 శాతం ఈఎంఐ-టు-ఆదాయ నిష్పత్తితో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. కొంత కాలంగా హైదరాబాద్‭లో రియల్ ఎస్టేట్ విస్తృతమవుతుండడం, అలాగే రాష్ట్రంలో పర్ క్యాపిటా పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ తర్వాత బెంగళూరు, చెన్నై 28 శాతంతో నాల్గవ స్థానాన్ని పంచుకున్నాయి. పూణె, కోల్‌కతా 26 శాతంతో ఐదవ స్థానంలో ఉన్నాయి.

ఇల్లు కొనడానికి చౌకైన నగరం ఏది?
ఇదిలా ఉంటే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ భారతదేశంలో నివసించడానికి అత్యంత సరసమైన నగరంగా ఆవిర్భవించింది. సగటు కుటుంబం తన ఆదాయంలో కేవలం 23 శాతాన్ని గృహ రుణం కింద ఈఎంఐలకు కేటాయిస్తే సరిపోతుందని నివేదిక పేర్కొంది. ఈ సూచిక 20 సంవత్సరాల రుణ కాల వ్యవధిని, 80 శాతం లోన్-టు-వాల్యూ నిష్పత్తిని, నగరాల అంతటా ఒకే విధమైన ఇంటి పరిమాణాన్ని కలిగి ఉంటుంది. గత సంవత్సరంలో ఈ నగరాల్లో జీవన వ్యయాలు పెరిగాయి. ఈఎంఐ-టు-ఆదాయ నిష్పత్తులు దాదాపు 1-2 శాతం పాయింట్లు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని కీలక రుణ రేటును మునుపటి సంవత్సరం నుంచి 250 బేసిస్ పాయింట్ల మేర పెంచడం దీనికి ప్రధాన కారణం. ఈ చర్య నగరాల్లో సగటున 14.4 శాతం EMI భారాలకు దారితీసిందని నివేదిక పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు