INDIA bloc: ఇండియా కూటమి భారీ నిర్ణయం.. భోపాల్ నుంచి పోరు ప్రారంభం

సీట్ల పంపకాలు లాంటివి ఆయా పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోని పార్టీలే నిర్ణయిస్తాయి. ఒకరంగా చెప్పాలంటే ఎవరివారే పోటీ చేస్తారు, కాకపోతే అన్ని పార్టీలను కూటమిగా పిలుచుకుంటారు. మరి ఈ ప్రతిపాదనపై ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై స్పష్టత లేదు

2024 Elections: ఇండియా కూటమి ఏర్పడిన అనంతరం మొట్టమొదటి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఆ కూటమి నేతలు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంట్లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి జంగ్ సైరన్ మోగించనున్నారు. అక్టోబరు మొదటి వారంలో తొలి బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ సమావేశంలో సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని అనుకున్నప్పటికీ దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే కూటమి ఏర్పాటు సమయంలోనే ఎవరికి పట్టున్న రాష్ట్రాల్లో వారిని స్వతంత్రంగా వదిలేయాలనే ప్రతిపాదన వచ్చింది.

Delhi: బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. ఘనంగా స్వాగతం పలికిన కాషాయ నేతలు

దీని ప్రకారం.. సీట్ల పంపకాలు లాంటివి ఆయా పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోని పార్టీలే నిర్ణయిస్తాయి. ఒకరంగా చెప్పాలంటే ఎవరివారే పోటీ చేస్తారు, కాకపోతే అన్ని పార్టీలను కూటమిగా పిలుచుకుంటారు. మరి ఈ ప్రతిపాదనపై ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై స్పష్టత లేదు. శరద్ పవార్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశానికి కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, తేజశ్వీ యాదవ్, సంజయ్ రౌత్, హేమంత్ సోరెన్, రాఘవ్ చడ్డా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, జావెద్ అలీ, డీ రాజా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అక్కడి నుంచే వచ్చే సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించేందుకు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు