HINDI In Bharath : భారత్‌లో హిందీ భాషపై దుమారం .. ప్రజలపై హిందీని రుద్దాలని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందంటూ విమర్శలు

అప్పుడెప్పుడో.. దేశంలో భాషా ఉద్యమాలు నడిచాయ్. మళ్లీ ఇప్పుడు.. భారత్‌లో హిందీ భాషపై దుమారం రేగుతోంది. కేంద్ర ప్రభుత్వం.. బలవంతంగా దేశ ప్రజలపై హిందీని రుద్దాలని చూస్తోందనే విమర్శలు వస్తున్నాయ్. ఇందుకు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికే కారణం. ఇంతకీ.. ఆ రిపోర్టులో ఏముంది? అసలు.. దేశమంతా ఒకే భాష ఎందుకుండాలి? హిందీ భాష అమలుపై వస్తున్న అభ్యంతరాలేంటి?

Controversy over Hindi language in India : అప్పుడెప్పుడో.. దేశంలో భాషా ఉద్యమాలు నడిచాయ్. మళ్లీ ఇప్పుడు.. భారత్‌లో హిందీ భాషపై దుమారం రేగుతోంది. కేంద్ర ప్రభుత్వం.. బలవంతంగా దేశ ప్రజలపై హిందీని రుద్దాలని చూస్తోందనే విమర్శలు వస్తున్నాయ్. ఇందుకు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికే కారణం. ఇంతకీ.. ఆ రిపోర్టులో ఏముంది? అసలు.. దేశమంతా ఒకే భాష ఎందుకుండాలి? హిందీ భాష అమలుపై వస్తున్న అభ్యంతరాలేంటి?

ప్రభుత్వ వ్యవహారాలు, ఆఫీసు కార్యకలాపాలు, విద్యా సంస్థలు, ఉద్యోగ నియామకాలు, కోర్టు తీర్పులు.. అదీ.. ఇదీ.. అనే తేడా లేదు.. ఏదైనా.. హిందీలోనే ఉండాలని చెబుతూ.. రిపోర్ట్ ఇచ్చింది పార్లమెంటరీ కమిటీ. దేశంలో ఇంగ్లీష్‌ను వాడకుండా.. దానిని ఆప్షనల్‌గా మార్చడమే ముఖ్య ఉద్దేశం తెలుస్తోంది. దేశ అధికార భాషకు సంబంధించి.. కేంద్రమంత్రి అమిత్ షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసులపై.. ఇండియా మొత్తం హాట్ డిబేట్ నడుస్తోంది. దీనికి సంబంధించి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసిన నివేదికపై దేశమంతటా దుమారం రేగుతోంది. ముఖ్యంగా.. దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Hindi Language in India : ‘భాషాయుద్ధానికి తెర తీయొద్దు’ అంటూ సీఎం స్టాలిన్ చెబుతున్న అభ్యంతరాలేంటి? చేస్తున్న హెచ్చరికలేంటి?

భారతీయులకు ఇంగ్లీష్‌ని దూరం చేయడమే లక్ష్యంగా.. విద్యాసంస్థల్లో హిందీ మీడియం మాత్రమే ఉండేలా.. ప్రభుత్వ ఆఫీసుల్లో వ్యవహారాలు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ హిందీలోనే జరిగేలా.. అమిత్ షా కమిటీ చేసిన ప్రతిపాదనలు చర్చనీయాంశంగా మారాయి. భారతదేశ ప్రజలపై.. బలవంతంగా హిందీని రుద్దేందుకు.. ఆ కమిటీ మొత్తం 112 సిఫారసులతో.. తన 11వ నివేదికను.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. అంతేకాదు.. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యాసంస్థలతో పాటు సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ.. హిందీ మీడియమే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఇంగ్లీష్‌ను ఆప్షనల్‌గా మార్చాలని ప్రతిపాదించారు.

టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ అయిన ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, నాన్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అయిన కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో.. హిందీ మీడియం మాత్రమే అమలు చేయాలని అమిత్ షా కమిటీ ప్రతిపాదించింది. కేవలం.. తప్పనిసరి అనుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. ఇంగ్లీష్ మీడియాన్ని కొనసాగించాలని.. అక్కడ కూడా నెమ్మదిగా ఇంగ్లీష్ స్థానంలో హిందీని భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో.. తప్పనిసరిగా ఉన్న ఇంగ్లీష్ స్థానంలో.. హిందీ పేపర్‌ను కంపల్సరీ చేయాలని ప్రతిపాదించారు. ఎంపిక చేసే ఉద్యోగులకు కూడా హిందీపై అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల్లోనూ హిందీ అనువాదం ఉండేలా చూడాలని.. తీర్పులు కూడా హిందీలోనే ఇచ్చే అవకాశం కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో.. ఆ భాష మాట్లాడని ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించాలని.. వారి నుంచి వివరణ కోరాలని కమిటీ సిఫారసు చేసింది. ఉద్యోగుల నుంచి సరైన వివరణ రాకపోతే.. వార్షిక పనితీరు నివేదికలో నమోదు చేయాలని సూచించింది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వల్ల హిందీ భాష పాపులర్ అయినందున.. ఐక్యరాజ్యసమితి అధికారిక భాషల్లోనూ.. హిందీని చేర్చాలని సిఫారసు చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు సంబంధించి.. ఆహ్వాన పత్రికలు, ఉపన్యాసాలన్నీ హిందీ మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు. హిందీ భాష అందుబాటులో లేని రాష్ట్రాల్లో.. అక్కడి విద్యార్థులు హిందీ భాష నేర్చుకునేందుకు.. హిందీలోనే ట్రైనింగ్ మెటీరియల్ కూడా అందించాలని సూచించారు. 3 సంవత్సరాలకు పైగా హిందీ పోస్టులు భర్తీ చేయకపోతే.. ఆ సంస్థకు సంబంధించిన ఇంచార్జ్ బాధ్యత వహించాలనే రూల్ కూడా పెట్టారు.

రాష్ట్రపతికి సమర్పించిన రిపోర్టులో.. దేశంలో వివిధ భాషలు మాట్లాడే ప్రాంతాలను ఆధారంగా చేసుకొని.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 3 రీజియన్లుగా విభజించింది అమిత్ షా కమిటీ. ఇందులో.. హిందీ మాట్లాడే రాష్ట్రాలన్ని.. రీజియన్ ఏ లో ఉన్నాయ్. ఈ గ్రూపులో.. బీహార్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. కేవలం.. హిందీ మాట్లాడే రాష్ట్రాలను.. గ్రూప్ ఎలో చేర్చడంపైనా వివాదం ముదురుతోంది. హిందీ మాట్లాడే వాళ్లను భారతీయ పౌరులుగా.. మిగతా భాషలు మాట్లాడే వారిని ద్వితీయ స్థాయి పౌరులుగా చూడటం.. దేశాన్ని విభజించడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయ్.

పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై.. విద్యా నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ లేకపోతే.. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడం సాధ్యం కాదని విద్యార్థులు, లెక్చరర్లు, విద్యా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్జెక్ట్ ఉండి.. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక.. ఎంతోమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని చెబుతున్నారు. ప్రపంచంతో పోటీ పడే నిర్ణయాలు తీసుకోవాలి గానీ.. భావి పౌరుల జీవితాలతో ఆడుకోవడం ఏమిటని.. నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ చదువులకు, అక్కడ ఉద్యోగాలకు ఇంగ్లీష్ తప్పనిసరి అని.. ఇలాంటి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని మండిపడుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు