ఓరి వీళ్ల దుంపతెగ.. క్రికెట్ ఆడుతున్నారా? చేపలు పడుతున్నారా! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

తొలి ఇన్నింగ్స్ లో 20వ ఓవర్ ను వెస్టిండీస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారాబాని వేయగా.. క్రీజులో ఉన్న బంగ్లా బ్యాటర్ తన్వీర్ ఇస్లాం డిఫెన్స్ ఆడి పరుగుకోసం వెళ్లాడు.

Zimbabwe Team (Credit @Cricket Times)

Zimbabwe vs Bangladesh T20 Match :  బంగ్లాదేశ్ – జింబాబ్వే జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. బంగ్లా బ్యాటర్ ను రనౌట్ చేసేందుకు జింబాబ్వే ఆటగాళ్లు పడరానిపాట్లు పడ్డారు. చివరికి ఔట్ చేయలేక పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య నాలుగో మ్యాచ్ శుక్రవారం షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లు లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. 19.4 ఓవర్లలో 138 పరుగులకు జింబాబ్వే బ్యాటర్లు ఆలౌట్ అయ్యారు.

Also Read : IPL 2024 : సచిన్ టెండూల్కర్ 14ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సాయి సుదర్శన్.. తొలి భారతీయుడు అతనే..!

తొలి ఇన్నింగ్స్ లో 20వ ఓవర్ ను వెస్టిండీస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారాబాని వేయగా.. క్రీజులో ఉన్న బంగ్లా బ్యాటర్ తన్వీర్ ఇస్లాం డిఫెన్స్ ఆడి పరుగుకోసం వెళ్లాడు. నాన్ స్ట్రైకర్ స్థానంలో ఉన్న ముస్తాఫీజుర్ రెహ్మాన్ కూడా పరుగు తీశాడు. ఆ సమయంలో బౌలర్ ముజారాబాని బాల్ అందుకొని వికెట్లకు త్రో వేశాడు. బాల్ వికెట్లకు తగలకుండా వెళ్లింది. వికెట్ల వెనకాల కొద్దిదూరంలో ఉన్న ఫీల్డర్ దానిని అందుకోలేక పోయాడు. దీంతో తన్వీర్ ఇస్లాం మరో రన్ కోసం వెళ్లాడు. కానీ, ముస్తాఫీజుర్ క్రీజులోనే ఉండిపోయాడు. ఈలోపు జింబాబ్వే ఫీల్డర్ బాల్ ను అందుకొని నాన్ స్ట్రైకర్ వికెట్ల వైపు బంతిని విసిరాడు.

Also Read : MS Dhoni : మైదానంలోకి దూసుకొచ్చి రచ్చచేసిన అభిమాని.. పరుగు తీసిన ధోనీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

అప్పటికే ముస్తాఫీజుర్ క్రీజుకు చాలా దూరంలో ఉన్నాడు. దీంతో అతను ఔట్ ఖాయమని భావించారు. కానీ, ఫీల్డర్ నుంచి బాల్ ను అందుకున్న జోనాథన్ కాంప్ బెల్ తొందరపాటులో వికెట్లు పక్కనే ఉన్నా బాల్ తో వికెట్లను కొట్టడంలో విఫలమయ్యాడు. ఈలోపు ముస్తాఫీజుర్ క్రీజులోకి చేరుకున్నాడు. జింబాబ్వే ఫీల్డర్ల తప్పిదంతో ఔట్ నుంచి ముస్తాఫీజుర్ తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రనౌట్ చేయడంలో జింబాబ్వే ఫీల్డర్ల తీరును చూసి చేపలు పడుతున్నారా? క్రికెట్ ఆడుతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు