MS Dhoni : మైదానంలోకి దూసుకొచ్చి రచ్చచేసిన అభిమాని.. పరుగు తీసిన ధోనీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

మ్యాచ్ 20వ ఓవర్ లో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంకోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని వచ్చిన ధో్నీ అభిమాని..

MS Dhoni : మైదానంలోకి దూసుకొచ్చి రచ్చచేసిన అభిమాని.. పరుగు తీసిన ధోనీ.. ఆ తరువాత ఏం జరిగిందంటే?

Fan touched MS Dhoni feet (Credits_ Twitter)

Updated On : May 11, 2024 / 10:36 AM IST

IPL 2024 Fan touched MS Dhoni Feet : ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ధోనీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ ధోనీ అభిమాని సెక్యూరిటీని తప్పించుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. దీంతో తొలుత అభిమానికి దొరకకుండా పరుగు తీసినట్లు కనిపించిన ధోనీ.. ఆ తరువాత అభిమానిని దగ్గరకు తీసుకున్నాడు. ఆ తరువాత సెక్యూరిటీ సిబ్బంది అతన్ని లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : IPL 2024 : సచిన్ టెండూల్కర్ 14ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన సాయి సుదర్శన్.. తొలి భారతీయుడు అతనే..!

మ్యాచ్ 20వ ఓవర్ లో మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులో ఉన్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంకోసం వేచి చూస్తున్నాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని వచ్చిన ధో్నీ అభిమాని.. ధోనీ వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన ధోనీ ఫన్నీగా అభిమానికి దొరకకుండా కొద్దిదూరం పరుగుపెట్టాడు. ఆ తరువాత ధోనీ అక్కడే నిలుచుండిపోవడంతో.. అభిమాని వచ్చి ధోనీ పాదాలనుతాకుతూ నమస్కారం చేశాడు. ధోనీసైతం నవ్వుతూ అతడిని తలను తట్టాడు.

Also Read : IPL 2024 : ఐపీఎల్ చరిత్రలో శుభమాన్ గిల్, సాయి సుదర్శన్ సరికొత్త రికార్డు

ఆ తరువాత అభిమాని భుజంపై చేయివేసి తీసుకెళ్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకొని అతన్ని పట్టుకెళ్లేందుకు ప్రయత్నించారు. ధోనీ తొలుత సెక్యూరిటీ సిబ్బందిని వారించినప్పటికీ సెక్యూరి సిబ్బంది అతన్ని లాక్కెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.