Shashikant Vasavada: కార్గిల్ యుద్ధ వీరుడి చివరి కోరికను తీర్చేందుకు 12 వేల కి.మీ ప్రయాణించిన కుమార్తె

1971 యుద్ధ సమయంలో కార్గిల్ పట్టణానికి ఎదురుగా ఉన్న వ్యూహాత్మకంగా ముఖ్యమైన PT 13620ని స్వాధీనం చేసుకోవడంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారని అంటారు.

1971 War Hero: 1971 యుద్ధ వీరుడు బ్రిగేడియర్ శశికాంత్ వాసవాడ (రిటైర్డ్) చివరి కోరికను తీర్చడానికి, ఆయన కుమార్తె 12 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించింది. ఆమె అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఉంటోంది. అయితే తండ్రి చివరి కోరిక నెరవేర్చడం కోసం జమ్మూ కశ్మీర్ లోని కార్గిల్ వచ్చింది. తన తండ్రి పోరాడిన కార్గిల్‌ మట్టికి ఆమె నివాళులర్పించింది. అనంతరం తండ్రి చితాభస్మాన్ని కార్గిల్‌లోని షిండో నదిలో నిమజ్జనం చేసింది. ఆయన అంత్యక్రియలు విదేశాల్లో జరిగినా.. శౌర్యగాథ రాసిన మట్టిలోనే ఆయన అస్థికలు కలపాలని తండ్రి శశికాంత్ ఆకాంక్షించారట. అస్థికల ప్యాకెట్ బయటకు ఆమె కన్నీరు మున్నీరైంది.

Rajasthan Polls: బీజేపీ వాళ్లను విమర్శిస్తే జైల్లో పెడతారు.. రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు

అనంతరం, తన తండ్రిని గుర్తు చేసుకుంటూ, సైనికులు ఎప్పటికీ చనిపోరని, కాలక్రమేణా వారి కీర్తి మాత్రమే మసకబారుతుందని చెప్పింది. శశికాంత్ వస్దా జూలై 11, 2023న టెక్సాస్‌లోని సిబోలోలో మరణించారు. ఆయన జనవరి 1, 1933న భారతదేశంలో జన్మించారు. పదవీ విరమణ తర్వాత, కుటుంబంతో కలిసి టెక్సాస్‌లో స్థిరపడ్డారు. 1971 యుద్ధంలో కార్యకలాపాల సమయంలో 9 JAK LI రెండవ కమాండ్‌గా ఉన్నారు.

1971 యుద్ధ సమయంలో కార్గిల్ పట్టణానికి ఎదురుగా ఉన్న వ్యూహాత్మకంగా ముఖ్యమైన PT 13620ని స్వాధీనం చేసుకోవడంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారని అంటారు. 1971లో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్)లో దాదాపు 30 లక్షల మందిని పాకిస్థాన్ ఊచకోత కోసిందని చెబుతారు. ఈ 14 రోజుల యుద్ధంలో 93 వేల మంది పాక్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయారు. ఈ యుద్ధంలో భారత నౌకాదళం తన అలుపెరగని ధైర్యాన్ని ప్రదర్శించింది.

ట్రెండింగ్ వార్తలు