Punjab: పంజాబ్‌లో లా అండ్ ఆర్డర్ విఫలం.. కేంద్రం జోక్యం చేసుకోవాలి: మాజీ సీఎం అమరీందర్ సింగ్

కొద్ది రోజులుగా పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరుగుతోంది.

Punjab: పంజాబ్‌లో లా అండ్ ఆర్డర్ పరిస్థితి సక్రమంగా లేదని, వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు ఆ రాష్ట్ర మాజీ సీఎం అమరీందర్ సింగ్. కొద్ది రోజులుగా పంజాబ్‌లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు.

Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు

వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. దీంతోపాటు పాకిస్తాన్ భూభాగం నుంచి భారత్‌లోకి డ్రోన్లు కూడా చొచ్చుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై అమరీందర్ సింగ్ ప్రశ్నించారు. పంజాబ్ ప్రభుత్వం, సీఎం భగవంత్ మన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘పంజాబ్‌లో ఏం జరుగుతోంది అనే దానిపై సీఎం భగవంత్ మన్‌కు ఆసక్తి లేదు. ఏం చర్య తీసుకోవాలన్నా ఆయన భయపడుతున్నారు. ఎలాంటి చర్యా తీసుకోవద్దని పోలీసులకూ ఆదేశాలు వెళ్లాయి.

Hit And Drag Case: స్కూటర్‌ను ఢీకొన్న ట్రక్కు.. వృద్ధుడు, ఆరేళ్ల బాలుడు మృతి.. బాలుడి మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ కాలం నడవలేదు. అజ్నాలా ఘటన జరిగిన రోజు భగవంత్ మన్ ముంబైలో అరవింద్ కేజ్రీవాల్‌తో ఉన్నారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన సమస్య. ఇది కేంద్రానికి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ పంజాబ్ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కోలేకుంటే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకోవాలి. పంజాబ్‌లోకి పాకిస్తాన్ నుంచి డ్రోన్లు దూసుకొస్తున్నాయి. దీనిపై కేంద్రం దృష్టిపెట్టాలి. శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి’’ అని అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇటీవల అక్కడ కొందరు సిక్కులు తమకు ప్రత్యేక దేశం (ఖలిస్తాన్) కావాలంటూ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.

 

ట్రెండింగ్ వార్తలు