Scrap Ambassdor : 1000 కిలోల స్ర్కాప్ మెటీరియల్ తో అంబాసిడర్ కారు తయారు చేసిన కళాకారుడు

1000 కిలోల స్ర్కాప్ మెటీరియల్ తో అంబాసిడర్ కారు తయారు చేసిన కళాకారుడు ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Indore Artist Sundar Gurjar Scrap Ambassdor car : అంబాసిడర్.. అది పేరు కాదు. బ్రాండ్. దాని సౌండ్.. ఇప్పటికీ కార్ లవర్స్‌కి కిక్ ఇస్తుంది. 3 దశాబ్దాల కిందటి వరకు.. ఇండియన్ కార్ మార్కెట్‌లో అంబాసిడర్‌దే ఆధిపత్యం. ఇప్పటికీ.. ఆ కార్ అంటే ఇష్టపడని వారుండరు. అలాంటి అంబాసిడర్‌ని.. ఈ 2022లో తయారుచేస్తే? స్టీల్‌తోనో, మెటల్‌తోనో కాకుండా.. స్క్రాప్‌తో తయారుచేస్తే.? ఇంకా చేస్తే ఏంటి? చేసేశాడు.. దాన్ని మీరు చూడటమే మిగిలింది.

కళాకారుడి కళ్లతో చూడాలే గానీ.. స్క్రాప్‌లోనూ ఓ కళాఖండం దాగుంటుందని నిరూపించాడు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కు చెందిన సుందర్ గుర్జార్ అనే కళాకారుడు. కళకు కాదేదీ అనర్హమన్నట్లుగా..సుందర్ గుర్జార్.. స్క్రాప్‌తోనే.. ఈ అంబాసిడర్‌ని తయారుచేశారు. ఇక పని చేయవు.. ఎందుకూ పనికిరావు అని.. పారేసిన స్క్రాప్‌తోనే.. ఈ అందమైన అంబాసిడర్ చేసి చూపించారు సుందర్. ఈ కార్.. అంబాసిడర్ లవర్స్‌నే కాదు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

అయినా.. అంబాసిడర్ కారులో.. ఆ లగ్జరీనే వేరు. ఎన్ని కార్లొచ్చినా.. అంబాసిడర్ కిందే అన్నట్లుగా ఉంటుంది కార్. అంతలా.. ఇండియన్స్‌పై ముద్ర వేసింది. కొన్ని దశాబ్దాల పాటు కార్ లవర్స్‌ని.. తన చుట్టూ తిప్పుకుంది అంబాసిడర్. మార్కెట్‌లోకి కొత్త కంపెనీలు, ట్రెండ్‌కు తగ్గట్లు సరికొత్త డిజైన్లు, అధునాతన ఫీచర్లతో కార్లు రావడం మొదలయ్యేసరికి.. అంబాసిడర్ అలా.. అలా.. కనుమరుగైపోయింది. అయితే.. ఇప్పటికీ చాలా చోట్ల పాత అంబాసిడర్ కార్లు కనిపిస్తుంటాయ్. అలాంటి.. ఓ పాత అంబాసిడర్ కారుకు.. స్క్రాప్‌తో ఇలా కొత్త లుక్ తీసుకొచ్చారు సుందర్.

ఆర్టిస్ట్.. సుందర్‌ గుర్జార్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ చదివారు. ఎన్నో వస్తువులకు తన కళతో కొత్త రూపు తెచ్చారు. అలా.. ఈ మధ్యే ఆయన ఫోకస్ ఓ పాత అంబాసిడర్ కారు మీదకు మళ్లింది. ఇక.. లేట్ చేయకుండా.. ఏమాత్రం వెయిట్ చేయకుండా.. తన బ్రెయిన్‌లో మెదిలిన ఐడియాను అమలు చేసేశారు. దానికి రూపమే.. ఈ స్క్రాప్ అంబాసిడర్. వెయ్యి కిలోల స్క్రాప్ మెటీరియల్‌తో.. అంబాసిడర్‌కు ఇలా కొత్త లుక్ తీసుకొచ్చారు. కారు చుట్టూ.. 7 వందల కిలోల బోల్టులను.. అందంగా అమర్చారు. మరో.. 4 వందల కిలోల వాహనాల చైన్‌లతో పాటు మిగతా విడి భాగాలను అమర్చారు. అలా.. ఇప్పుడు మనం చూస్తున్న అంబాసిడర్ లుక్ రావడానికి.. 3 నెలల సమయం పట్టిందని చెప్పారు సుందర్ గుర్జార్.

అంబాసిడర్ ఒక్కటే కాదు.. అనేక పాత వస్తువులకు.. తన కళతో సరికొత్త రూపు తెచ్చారు సుందర్. తెల్లని అంబాసిడర్ కాస్తా.. నట్లు, చైన్లతో.. నల్లగా మారిపోయినా.. లుక్ మాత్రం అదిరిపోయింది. 3 నెలల పాటు కష్టపడి.. ఇంత అందంగా తీర్చిదిద్దిన అంబాసిడర్ కారు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. దీనిని చూసి.. చాలా మంది.. టైమ్ ట్రావెల్ చేసి.. కాస్త వెనక్కి వెళ్లి.. తమ అంబాసిడర్ డేస్‌ని గుర్తు చేసుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు