Kashmir : అందాల కశ్మీరులోయలో మిస్ వరల్డ్, సుందరాంగుల పర్యటన

పచ్చని చెట్లు... లోతైన లోయలు...ఎత్తైన కొండలు...మంచు పర్వతాలతో కూడిన జమ్మూకశ్మీరులో ప్రపంచ సుందరాంగులు విహరించారు. ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కాతోపాటు పలువురు అందాల రాణులు ప్రకృతి పరవశించే కశ్మీరు లోయలో విహరించి అనందానుభూతి పొందారు....

Beauty Queens Kashmir tour

Kashmir : పచ్చని చెట్లు… లోతైన లోయలు…ఎత్తైన కొండలు…మంచు పర్వతాలతో కూడిన జమ్మూకశ్మీరులో ప్రపంచ సుందరాంగులు విహరించారు. ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్కాతోపాటు పలువురు అందాల రాణులు ప్రకృతి పరవశించే కశ్మీరు లోయలో విహరించి అనందానుభూతి పొందారు. మిస్ వరల్డ్ 2023కి ప్రీ ఈవెంట్ శ్రీనగర్‌లో జరిగింది. కాశ్మీర్‌లో జరిగిన జి20 కార్యవర్గ సమావేశం జమ్మూ కాశ్మీర్‌కు గేమ్ ఛేంజర్ అని రుజువు చేసింది. (Miss World Karolina Bielawska) ప్రపంచంలోని అందాల సుందరులు ఒక రోజు శ్రీనగర్ లో పర్యటించారు. (Beauty Queens Experience Best Of Kashmir) మిస్ వరల్డ్‌తో పాటు మిస్ వరల్డ్ కరీబియన్, ఎమ్మీ పెనా వంటి పలువురు అందాల భామలు కశ్మీరు లోయలో పర్యటించారు.

Indigo Flight Services : నార్త్ గోవా నుంచి అబుదాబీకి నేరుగా ఇండిగో విమాన సర్వీసు

మిస్ వరల్డ్ అమెరికా శ్రీ సైనీ, మిస్ వరల్డ్ ఇండియా సినీ శెట్టి, మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ జెస్సికా గాగెన్, మిస్ ఆసియా, ప్రిసిలియా కార్లా సపుత్రి యూల్స్ కశ్మీరులో తిరిగారు. ఈ పర్యటనలో అందాల భామలతోపాటు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్, సీఈఓ జూలియా ఎరిక్ మోర్లీ కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న మిస్ వరల్డ్ 2023 పోటీల 71వ ఎడిషన్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.

Assam Floods : మళ్లీ అసోంలో వరదలు…15 మంది మృతి

అందాల భామలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ లేక్‌తో సహా శ్రీనగర్ నగరంలో పర్యటించారు. కశ్మీరు ప్రకృతి అందాలను అందాల రాణులు ప్రశంసించారు. ఆరుసార్లు ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న భారత్ మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. భారతదేశం చివరిసారిగా 1996వ సంవత్సరంలో ఈవెంట్‌ను నిర్వహించింది.

Indonesia : ఇండోనేషియా బాలి సముద్రంలో భారీ భూకంపం… సునామీ హెచ్చరిక లేదు

సుందరాంగులు కశ్మీరు లోయ అందాలను ఆస్వాదించారు. ఆర్టికల్ రద్దు, జి 20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలతో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దాదాపు 17 వేల మంది విదేశీయులు కాశ్మీర్ లోయలో విహరించారు. అందాల భామల విహారంతో కశ్మీరు అందాలకు మరింత వన్నె వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు