RTO Services Online: ఆర్‌టీఓ సేవలు ఇకపై ఆన్‌లైన్‌లోనే.. నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం

లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహన రిజిస్ట్రేషన్ వంటి సేవలు పొందేందుకు ఇకపై ఆర్‌టీఓ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి 58 రకాల సేవల్ని ఆన్‌లైన్‌ ద్వారానే పొందేలా కేంద్రం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.

RTO Services Online: కండక్టర్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ వంటి 58 రకాల సేవలు పొందేందుకు పౌరులు ఇకపై ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారానే పొందేలా చట్టంలో మార్పులు తెస్తూ కేంద్రం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది.

CM KCR: వారం రోజుల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు: సీఎం కేసీఆర్

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, పర్మిట్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఓనర్‌షిప్, లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి 58 రకాల సేవల్ని ఆన్‌లైన్‌ ద్వారానే పొందొచ్చు. ఆధార్ కార్డు అనుసంధానం చేయడం ద్వారా పౌరులు స్వచ్ఛందంగా ఈ సేవలు పొందవచ్చు. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మాత్రం నేరుగా ఆర్‌టీఓ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంటుంది.

Pregnant Woman: గర్భిణిని ట్రాక్టర్‌తో తొక్కి చంపిన రికవరీ ఏజెంట్.. ట్రాక్టర్ లోన్ కట్టలేదని ఘాతుకం

ఆధార్ కార్డు లేని వాళ్లు మాత్రం నేరుగా ఆర్‌టీఓ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకుని, ఈ సేవలు పొందవచ్చు. వీళ్లు ప్రభుత్వం అనుమతించిన ఏదో ఒక ధృవీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. తాజా నిర్ణయం వల్ల పౌరులకు చాలా సమయం ఆదా అవుతుందని, అలాగే ఆర్‌టీఓ కార్యాలయంలో పని భారం కూడా తగ్గుతుందని కేంద్రం చెప్పింది.

 

 

ట్రెండింగ్ వార్తలు