Nanded hospital : నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 35కు పెరిగిన మృతుల సంఖ్య

మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....

Nanded hospital

Nanded hospital : మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్‌లోని డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది. మృతుల్లో 16 మంది శిశువులు 19 మంది పెద్దలు ఉన్నారు. మరణించిన శిశువుల్లో కవల మగపిల్లలు ఉన్నారు.వీరు తక్కువ బరువుతో జన్మించారని వైద్యులు చెప్పారు. నాందేడ్ ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని, దోషులను విడిచిపెట్టబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హామీ ఇచ్చారు.

Also Read : Tripura : త్రిపురలో రెండు గ్రూపులపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిషేధం

మహారాష్ట్ర వైద్య విద్యశాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ మంగళవారం ఆసుపత్రిని సందర్శించి వైద్యులు, పరిపాలనా సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యుల కొరత మరణాలకు కారణమని మంత్రి అంగీకరించారు. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా ఖాళీలను భర్తీ చేసే వరకు లోటును అధిగమించేందుకు కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి హసన్ చెప్పారు. మరో వైపు శంభాజీ నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 14 మంది మరణించారు. ఇందులో ఇద్దరు శిశువులు ఉన్నారు.

ఆసుపత్రుల్లో మరణాలపై చర్యలు తీసుకుంటాం : కేంద్ర మంత్రి

అయితే వైద్యులు లేక మందుల కొరత వల్ల మరణాలు సంభవించలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయ్ కళ్యాణ్కర్ తెలిపారు. రెండు ఆసుపత్రుల మరణాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌ కోరారు. ‘‘ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాలు సంభవించడం దురదృష్టకర సంఘటన. సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణ కోరాం. నాందేడ్ ఆసుపత్రిలో పరిస్థితి విషమంగా ఉంది. సమగ్ర నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి భారతీ పవార్ తెలిపారు.

కాంట్రాక్టుపై వైద్యులను నియమిస్తాం…

ముష్రీఫ్‌తో పాటు సంరక్షక మంత్రి గిరీష్ మహాజన్ నాందేడ్‌కు వెళ్లారు. ఈ సమావేశానికి మాజీ సీఎం, ఎమ్మెల్యే అశోక్ చవాన్, ఎంపీ ప్రతాప్ చిఖాలీకర్ హాజరయ్యారు. ‘‘ఇది అత్యవసర పరిస్థితి. కాంట్రాక్ట్‌పై వైద్యులను నియమించడమే కాకుండా, ఇతర ఆసుపత్రుల నుంచి వైద్యులను డిప్యూట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం, ప్రైవేట్‌ వైద్యుల సహాయం కోరుతున్నాం’’ అని మంత్రి ముష్రిఫ్‌ తెలిపారు. నర్సులు, పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొన్నారు.

Also Read :  Bus Accident : ఇటలీలో ఘోర బస్సు ప్రమాదం…21 మంది మృతి

శివసేనకు చెందిన షిండే శిబిరానికి చెందిన హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ నాందేడ్ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్డిని శుభ్రం చేయమని ఆసుపత్రి తాత్కాలిక డీన్ డాక్టర్ ఎస్ ఆర్ వాకోడ్‌ను ఎంపీ బలవంతం చేశారు. ఈ ఘటన వైద్యుల్లో కలకలం రేపింది. మహారాష్ట్ర స్టేట్ అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఎంపీ చర్యను ఖండించింది.

ట్రెండింగ్ వార్తలు