Viral Video : వామ్మో.. మద్యం మత్తులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన మహిళ, పచ్చి బూతులు తిడుతూ పోలీసులపైనే దాడి

మద్యం మత్తులో మహిళ చేసిన వీరంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Gujarat - Viral Video

Gujarat – Viral Video : మద్యం మత్తులో పురుషులే కాదు మహిళలు కూడా రెచ్చిపోతున్నారు. పీకలదాకా మందు తాగేసి నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేస్తున్నారు. మహిళ అనే సంగతి మర్చిపోయి రౌడీలా వ్యవహరిస్తున్నారు. పచ్చి బూతులు తిడుతూ పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రం వడోదరలో ఓ మహిళ మద్యం మత్తులో నడిరోడ్డుపై రచ్చ రంభోలా చేసింది.

వడోదరలో ఓ మహిళ పీకల దాకా మందు తాగింది. మద్యం మత్తులోనే వాహనాన్ని నడిపింది. ఈ క్రమంలో యాక్సిడెంట్ చేసింది. మరో వాహనాన్ని ఢీకొట్టింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. అంతే, ఆ మహిళ రెచ్చిపోయింది. పోలీసులను బూతులు తిట్టింది. నన్ను టచ్ చేస్తారా? మీకెంత ధైర్యం? అంటూ వారిపై దాడికి దిగింది.

Also Read..Fierce Winds : ఓ మై గాడ్.. ఇవేం గాలులు రా నాయనా.. మనుషులు ఎలా ఎగిరిపోయారో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

అసభ్య పదజాలంతో పోలీసులను దూషించడమే కాదు వారితో అనుచితంగా ప్రవర్తించింది. మగ పోలీసులపై చేయి చేసుకుంది. పోలీసులపై దూసుకెళ్లింది. ఆ మహిళను కంట్రోల్ చేయలేకపోయిన మగ పోలీసులు మహిళా పోలీసులను రంగంలోకి దించాల్సి వచ్చింది. మహిళా పోలీసులు సైతం అతి కష్టం మీద ఆ మహిళను పోలీస్ జీపులోకి ఎక్కించగలిగారు. అక్కడి నుంచి స్టేషన్ కు తీసుకెళ్లారు.

మద్యం మత్తులో మహిళ రచ్చ రచ్చ చేయగా అక్కడే ఉన్న స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీశారు. మహిళ వీరంగానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మద్యం మత్తులో ఆమె చేసిన అల్లరి అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ద్యావుడా.. ఆడవాళ్లు ఏంటి ఇలా తయ్యారయ్యారు? అని తల పట్టుకున్నారు.

Water Pipe Burst : వాటర్ పైప్ బ్లాస్ట్, ఏకంగా 8వ అంతస్తుకు ఎగిసిన నీళ్లు.. చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం

కాగా.. మద్యం తాగి వాహనం నడపడం, హంగామా సృష్టించడం, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం వంటి అభియోగాలపై ఆమెపై కేసు నమోదైంది.

 

ట్రెండింగ్ వార్తలు