Water Pipe Burst : ఓ మై గాడ్.. వాటర్ పైప్ బ్లాస్ట్, ఏకంగా 8వ అంతస్తుకు ఎగిసిన నీళ్లు.. చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం

చాలా ఫోర్స్ తో నీళ్లు అంతపైకి చిమ్మడంతో స్థానికులు నివ్వెరపోయారు. ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురయ్యారు. Water Pipe Burst - Mumbai

Water Pipe Burst – Mumbai : వాటర్ పైప్ బ్లాస్ట్ అవడం కామనే. లీకేజీల కారణంగా అప్పుడప్పుడు పైపులు పగిలిపోతుంటాయి. దాంతో నీరు పైకి చిమ్మడం సర్వసాధారణం. ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. పెద్దగా వింతగా అనిపించి ఉండకపోవచ్చు.

తాజాగా ముంబైలోనూ అలాంటి ఘటనే జరిగింది. వాటర్ పైప్ బ్లాస్ట్ అయ్యింది. అంతే, ఒక్కసారిగా నీరు పైకి చిమ్మింది. ఆ నీళ్లు ఎంతపైకి చిమ్మాయి అంటే.. అంతా చూసి ఆశ్చర్యపోయారు. కాదు కాదు.. భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. ఎందుకంటే, ఏకంగా 8 అంతస్తుల భవనంపైకి నీళ్లు చేరాయి. అంత ఎత్తుకు నీరు చిమ్మింది.

Also Read..Murder For Biryani : ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

ముంబై అంధేరి వెస్ట్ లోని ఆదర్శనగర్ ప్రాంతంలోని ఓ భవనంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. భవనంలోని నీటి పైప్ బ్లాస్ట్ అయ్యింది. అంతే, ఒక్కసారిగా నీళ్లు పైకి చిమ్మాయి. నీళ్లు ఎంత ఎత్తువరకు వెళ్లాయంటే.. ఏకంగా 8 అంతస్తుల భవనంపైకి నీళ్లు చేరాయి. చాలా ఫోర్స్ తో నీళ్లు అంతపైకి చిమ్మడంతో స్థానికులు నివ్వెరపోయారు. ఏం జరుగుతుందోనని, ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురయ్యారు. కాసేపు అంతా వణికిపోయారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు నీటి సరఫరా ఆపేయడంతో లీకేజీ ఆగిపోయింది.

కాగా, పైప్ బ్లాస్ట్ కావడం నీరు పైకి చిమ్మడాన్ని కొందరు తమ ఫోన్లలో వీడియో తీశారు. నీరు 8వ అంతస్తు వరకు చిమ్మిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది చూసి జనాలు.. వామ్మో అంటున్నారు. ఇది పైప్ బ్లాస్ట్ లా లేదు జలపాతంలా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఏదో కొండపై నుంచి నీరు కిందకు పడ్డట్లు కనిపించిందన్నారు.

Also Read..Fierce Winds : ఓ మై గాడ్.. ఇవేం గాలులు రా నాయనా.. మనుషులు ఎలా ఎగిరిపోయారో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

ఇలాంటి పైప్ బరస్ట్ సీన్ జీవితంలో ఇంతవరకు చూడలేదని కొందరు స్థానికులు చెప్పారు. పైప్ బ్లాస్ట్ తో ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అంత ఎత్తుకు నీరు చిమ్మడంతో ఆ బిల్డింగ్ కు ఏమైనా డ్యామేజీ జరిగి ఉండొచ్చని అందులో నివాసం ఉంటున్న వారు ఆందోళన చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు