Kota : కోటాలో ఆగని ఆత్మహత్యలు.. మరో విద్యార్థి సూసైడ్, 6వ ఫ్లోర్ నుంచి దూకేశాడు.. అసలేం జరుగుతోంది

వీక్లీ టెస్ట్ రాసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. Kota Suicides

Kota Suicides : రాజస్తాన్ కోటాలో ఆత్మహత్యలు ఆగడం లేదు. అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. విద్యార్థుల సూసైడ్ లు కొనసాగుతున్నాయి. తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

మహారాష్ట్రకు చెందిన ఆవిష్కార్ అనే విద్యార్థి.. ఆదివారం(ఆగస్టు 27) కోచింగ్ సెంటర్ బిల్డింగ్ లోని 6వ ఫ్లోర్ నుంచి దూకాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఈ ఏడాది విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 22కి చేరింది. కాగా, పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకనే విద్యార్థులు చనిపోతున్నట్లు తెలుస్తోంది.

ఆవిష్కార్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆదివారం వీక్లీ టెస్ట్ రాసి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చాడు. బయటకు రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read..Youtube Videos : కొంపముంచిన యూట్యూబ్ వైద్యం.. ఆ వీడియోలు చూసి 10 కర్పూరం బిళ్లలు మింగేశాడు, ఆ తర్వాత ఏమైందంటే

కాగా.. మరో విద్యార్థి కూడా సూసైడ్ చేసుకున్నాడు. శనివారం రోజున ఈ ఘటన జరిగింది. ఆ విద్యార్థి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకున్నాడు. కోటా ఎడ్యుకేషన్ హబ్ గా గుర్తింపు పొందింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. ఇంజినీరింగ్, మెడికల్, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఈ కోచింగ్ సెంటర్ కు వస్తారు. అయితే, విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటు తోటి విద్యార్థుల్లోనూ, అటు వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది.

ఈ ఒక్క నెలలోనే ఇప్పటివరకు 5 ఆత్మహత్యలు వెలుగుచూశాయి. ఒక నెలలో వ్యవధిలో ఇంతమంది సూసైడ్ చేసుకోవడం గత ఎనిమిదేళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. గత నాలుగు నెలల వ్యవధిలో 16 మంది సూసైడ్ చేసుకున్నారు.

Kota Anti Suicide Nets (Photo : Google)

నిన్న స్ప్రింగ్ ఫ్యాన్లు, నేడు బాల్కనీల్లో నెట్స్..
కోటాలో కోచింగ్ కోసం వచ్చే విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో అధికారులు అలర్ట్ అయ్యారు. బలవన్మరణాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవలే విద్యార్థుల గదుల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. ఈ స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల ద్వారా ఆత్మహత్యకు ప్రయత్నించినా.. వేలాడకుండా చేస్తాయని అధికారులు తెలిపారు. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. హాస్టల్ బాల్కనీలు ఓపెన్ గా ఉండకుండా యాంటీ సూసైడ్ నెట్స్ అమర్చారు. అయితే, ఇలాంటి ఐడియాలు మానేసి.. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా చూడాలని, అప్పుడే ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు