Trinamool leaders : ఢిల్లీలో నిరసన తెలుపుతున్న తృణమూల్ నేతల నిర్బంధం

తమ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీలోని కృషి భవన్ లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా 30 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు....

TMC leaders detained

Trinamool leaders : తమ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. ఢిల్లీలోని కృషి భవన్ లో టీఎంసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ సహా 30 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాతో సహా నాయకులను పోలీసులు కృషి భవన్ నుంచి ఈడ్చుకెళ్లారు. అభిషేక్ బెనర్జీ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన టీఎంసీ ప్రతినిధి బృందం సోమవారం నుంచి ఢిల్లీలో మకాం వేసింది.

Also Read : Nanded hospital : నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 35కు పెరిగిన మృతుల సంఖ్య

గాంధీ జయంతి సందర్భంగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాజ్‌ఘాట్‌ వద్ద ధర్నా ప్రారంభించారు. మంగళవారం టీఎంసీ ప్రతినిధి బృందం జంతర్ మంతర్‌లో నిరసనను నిర్వహించింది. తర్వాత కృషి భవన్‌లోని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద టీఎంసీ మార్చ్‌ చేపట్టింది. మంత్రిని కలవాలని డిమాండ్ చేస్తూ టీఎంసీ నాయకులు కృషి భవన్ వద్ద ధర్నా చేశారు. రాత్రి 9 గంటల వరకు ధర్నా కొనసాగించారు.

Also Read : Tripura : త్రిపురలో రెండు గ్రూపులపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిషేధం

దీంతో పోలీసులు రంగంలోకి దిగి టీఎంసీ నేతలను నిర్బంధించి వారిని మంత్రివర్గ ప్రాంగణం నుంచి తీసుకెళ్లారు. తమ నేతలను ఢిల్లీ పోలీసులు ఈడ్చుకెళ్లారని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఎక్స్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. పోలీసులు ఈడ్చుకెళ్లిన వీడియోను ఎంపీ మహువా మొయిత్రా షేర్ చేశారు.

‘‘నరేంద్రమోదీ మీరు మమ్మల్ని బయటకు లాగారు కాని మీరు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి నిధులు అక్రమంగా నిలిపివేశారు’’ అని ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు.

టీఎంసీ నేతల అరెస్ట్, విడుదల

అభిషేక్ బెనర్జీతో సహా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నాయకులను ఢిల్లీలోని కృషి భవన్‌లో అరెస్టు చేసిన తరువాత బుధవారం తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ ఇది భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని అన్నారు. ‘‘మమ్మల్ని లాగి అవమానించిన తీరు ప్రజాస్వామ్యానికి బ్లాక్‌డే. ఫోటోగ్రాఫ్‌లు అబద్ధాలు చెప్పవు. మా ఎంపీలను వేధించిన తీరు బహిరంగంగానే ఉంది’’ అని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ తెలిపారు.

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు : సీఎం మమతా బెనర్జీ

అక్టోబర్ 5న కోల్‌కతాలో రాజ్ భవన్ చలో మార్చ్‌కు పిలుపునిచ్చారు. ‘‘ఈ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, బెంగాల్ ప్రజల పట్ల బీజేపీ సర్కారు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలను పూర్తిగా విస్మరించిన రోజు’’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు.

Also Read : Bus Accident : ఇటలీలో ఘోర బస్సు ప్రమాదం…21 మంది మృతి

ట్రెండింగ్ వార్తలు