Minister Rajnath Singh: రేపటి నుంచి జపాన్, మంగోలియా దేశాల్లో పర్యటనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపటి నుంచి (సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు) ఐదు రోజులపాటు జపాన్, మంగోలియా దేశాల్లో పర్యటించనున్నారు. 7వ తేదీ వరకు మంగోలియాలో, 8, 9 తేదీల్లో జపాన్ దేశాల్లో పర్యటిస్తారు.

Minister Rajnath Singh: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపటి నుంచి (సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు) ఐదు రోజులపాటు జపాన్, మంగోలియా దేశాల్లో పర్యటించనున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పర్యటనలో భాగంగా తొలుత మంగోలియా వెళ్లనున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటిస్తారు. సెప్టెంబర్ 8, 9 తేదీలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ జపాన్ దేశంలో పర్యటిస్తారు. రెండు దేశాలతో భారతదేశం యొక్క రక్షణ, భద్రతా సంబంధాలను విస్తరించే లక్ష్యంతో ఈ పర్యటన సాగనున్నట్లు తెలిసింది.

Rajnath Singh: అందుకే నేను ఆర్మీలో చేరలేకపోయాను: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

జపాన్‌ పర్యటనలో భాగంగా రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘2+2’ విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల చర్చల్లో జపాన్ సహచరులతో పాల్గొంటారని సమాచారం. ఇండో – పసిఫిక్‌లోని పరిణామాలను సమీక్షించడంతో పాటు రక్షణ, భద్రత రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాలని వారు భావిస్తున్నారు. జపాన్ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి, రక్షణ మంత్రి యసుకాజు హమదా చర్చలకు నాయకత్వం వహిస్తారు

Rajnath Singh: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే: రాజ్‌నాథ్ సింగ్

మంగోలియాతో భారతదేశం యొక్క రక్షణ, భద్రతా సంబంధాలు కూడా పురోగమిస్తున్నాయి. రక్షణ, భద్రతతో సహా విభిన్న రంగాల్లో సంబంధాలకు నూతన శక్తిని తీసుకువచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మే 2015లో మంగోలియా పర్యటనకు వెళ్లారు. పర్యటన సందర్భంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మంగోలియాకు ఒక బిలియన్ డాలర్ల క్రెడిట్‌ను భారత్ ప్రకటించింది. వ్యూహాత్మక భాగస్వామ్యానికి వారి సంబంధాలను మరింత బలోపేతం చేసింది. భారతదేశం – మంగోలియా సంయుక్త సైనిక వ్యాయామం ‘నోమాడిక్ ఎలిఫెంట్’ ఏటా నిర్వహిస్తారు.

ట్రెండింగ్ వార్తలు