Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి రాహుల్ ఔట్.. దూరంగా ఉండాలని నిర్ణయం

పార్టీ సీనియర్ నేతలు చాలా సందర్భాల్లో రాహుల్ మళ్లీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అలాగే పార్టీలోని చాలా మంది కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 'మై లీడర్ రాహుల్' అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు కూడా నడిపారు. కానీ, రాహుల్ ప్రతీసారి తన విముఖతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పార్టీలోని కొంత మంది ఈ అభిలాషను వదులుకోలేదు.

Congress Presidential Poll: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ విముఖత చూపిస్తున్నారట. అంతే కాదు, తొందరలో జరగబోయే ఈ ఎన్నికకు కూడా ఆయన దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ అధ్యక్ష రేసులో రాహుల్ లేరనే విషయం స్పష్టమవుతోంది. ఒకవైపు రాహులే అధ్యక్షుడిగా ఉండాలంటూ వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ విభాగాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తుండగా.. మరొకవైపు ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని రాహుల్ నిర్ణయించుకోవడం గమనార్హం.

17వ లోక్‭సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం అనంతరం పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు. అనంతరం తాత్కాలిక అధ్యక్ష పదవీ బాధ్యతలు మాజీ అధినేత సోనియా గాంధీ తీసుకున్నారు. అప్పటి నుంచి శాశ్వత అధ్యక్ష పదవిపై ఆ పార్టీలో ముసలం కొనసాగుతూనే ఉంది. రేపు, ఎల్లుండి అంటూ ఈ ఎన్నికను అధిష్టానం వాయిదా వేస్తూ వస్తోంది. అయితే ఈ పదవికి ఏమాత్రం సముఖంగా లేని రాహుల్ గాంధీని ఒప్పంచి మళ్లీ ఆ స్థానంలో కూర్చోబెట్టడానికేననే ప్రచారం జోరుగా సాగింది.

పార్టీ సీనియర్ నేతలు చాలా సందర్భాల్లో రాహుల్ మళ్లీ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. అలాగే పార్టీలోని చాలా మంది కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘మై లీడర్ రాహుల్’ అంటూ సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు కూడా నడిపారు. కానీ, రాహుల్ ప్రతీసారి తన విముఖతను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పార్టీలోని కొంత మంది ఈ అభిలాషను వదులుకోలేదు.

Bombay HC: కేంద్ర మంత్రి అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఉక్కు పాదం.. కూల్చివేయాలంటూ ఆదేశం

ఈ తరుణంలో పార్టీ అధ్యక్షుడు సహా పార్టీ విధివిధానాల్లో మార్పులు రావాలంటూ 23 మంది సీనియర్ నేతలు అధినేత సోనియాకు లేఖ రాయడం ఆ మధ్య సంచలనం లేపింది. ఈ పరిణామం అనంతరమే పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. ఇది కూడా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు వచ్చేనెలలో నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నెల 30 వరకు నామినేషన్లకు తుది గడువు విధించారు.

అయితే ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్.. ఈ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 29న భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రాన్ని దాటి కర్ణాటక రాష్ట్రంలో అడుగు పెడుతుంది. నామినేషన్‭కు 30 వరకే చివరి గడువు ఉండడంతో, ఆ సమయం నాటికి రాహుల్ ఢిల్లీకి చేరుకోలేరని అంటున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికలోనైనా రాహుల్ ఓటేస్తారా అనే దానిపై స్పష్టత లేదు.

Gujarat: అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ చేరి ‘మోదీ.. మోదీ..’ అంటూ నినాదాలు

ట్రెండింగ్ వార్తలు