Mahendra Singh Vaghela: గుజరాత్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేత

ఈయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతే. అయితే కొంత కాలం క్రితం బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఎన్నికల ముందు సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటికే అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ వంటి యువ తరాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లాగేసుకుంది. దీంతో గుజరాత్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీన పడింది. ఈ తరుణంలో బీజేపీ నుంచి కీలక నేత కాంగ్రెస్‭లోకి రావడం గమనార్హం.

Mahendra Singh Vaghela: గుజరాత్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు ఇస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టుండి షాక్ తగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని సగం ఖాళీ చేసి.. ఎన్నికల ముందు బలహీనంగా నిలబెట్టింది బీజేపీ. అయితే తాజాగా బీజేపీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ పార్టీలోకి దూకడం గమనార్హం. ఆ కీలక నేత గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ వాఘేలా కుమారుడు, ఎమ్మెల్యే మహేంద్ర సింగ్ వాఘేలా. శుక్రవారం బీజేపీకి గుడ్ బై చెప్పి హస్తం తీర్థం పుచ్చుకున్నాడు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగదీష్ ఠాకూర్.. మహేంద్ర సింగ్ వాఘేలాకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

వాస్తవానికి ఈయన ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నేతే. అయితే కొంత కాలం క్రితం బీజేపీలోకి వెళ్లారు. మళ్లీ ఎన్నికల ముందు సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటికే అల్పేష్ ఠాకూర్, హార్దిక్ పటేల్ వంటి యువ తరాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లాగేసుకుంది. దీంతో గుజరాత్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీన పడింది. ఈ తరుణంలో బీజేపీ నుంచి కీలక నేత కాంగ్రెస్‭లోకి రావడం గమనార్హం.

ఈ సందర్భంగా వాఘేలా మీడియాతో మాట్లాడుతూ ‘‘నేను బీజేపీలో ఇమడలేకపోయాను. బీజేపీలో చేరిన గత ఐదేళ్లలో ఆ పార్టీ కార్యక్రమాలన్నింటికీ దూరంగానే ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తాను’’ అని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీపై స్పందిస్తూ.. అది కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో ఉన్న నిర్ణయమని అన్నారు. వాఘేలాతో పాటు మరో ఆరుగురు నేతలు 2017లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ వేశారు. అనంతరం మూడు నెలలకే బీజేపీలో చేరారు. ప్రస్తుతం వాఘేలా ఎమ్మెల్యేగా ఉన్నారు.

Rahul Gandhi Tweet: క‌ంగ్రాట్స్ ఎలాన్ మ‌స్క్..! ప్ర‌తిప‌క్షాల గొంతును అణ‌చివేయ‌ర‌ని ఆశిస్తున్నాం.. ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ

ట్రెండింగ్ వార్తలు