Asian Games : గోల్ఫ్‌లో చ‌రిత్ర సృష్టించిన అదితి అశోక్.. 41కి చేరిన భార‌త ప‌త‌కాల సంఖ్య‌

చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) భార‌త్ ప‌త‌కాల పంట పండిస్తోంది. భార‌త్ ఖాతాలోకి మ‌రో మూడు ప‌త‌కాలు వ‌చ్చి చేరాయి. షూటింగ్‌లో రెండు, గోల్ఫ్‌లో ఓ ప‌త‌కం ల‌భించింది.

Aditi Ashok wins silver medal

Asian Games 2023 : చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో (Asian Games) భార‌త్ ప‌త‌కాల పంట పండిస్తోంది. భార‌త్ ఖాతాలోకి మ‌రో మూడు ప‌త‌కాలు వ‌చ్చి చేరాయి. షూటింగ్‌లో రెండు, గోల్ఫ్‌లో ఓ ప‌త‌కం ల‌భించింది. ఆదివారం జ‌రిగిన మ‌హిళ‌ల గోల్ఫ్ పోటీల్లో వ్య‌క్తిగ‌త విభాగంలో అదితి అశోక్ (Aditi Ashok) ర‌జ‌త ప‌త‌కం కైవ‌సం చేసుకుంది. తద్వారా గోల్ఫ్ క్రీడ‌ల్లో ప‌త‌కం గెలిచిన మొద‌టి భార‌త మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించింది. 1982లో లక్ష్మనన్ సింగ్ గోల్ఫ్‌లో భార‌త్‌కు గోల్డ్‌మెడ‌ల్ అందించాడు. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడ‌ల్లో భారత్‌కి గోల్ఫ్ ఈవెంట్‌లో పతకం రావడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

Aditi Ashok

Asian Games : భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణం.. అద‌ర‌గొట్టిన రోహన్‌ బొపన్న- రుతుజ జోడీ

అటు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో జోరావ‌ర్ సింగ్‌, చైనాయ్‌, పృథ్వీరాజ్ బృందం స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించింది. మహిళ‌ల ట్రాప్ టీమ్ విభాగంలో మ‌నీషా, రాజేశ్వ‌రి, ప్రీతి లు బృందం ర‌జ‌తం కైవ‌సం చేసుకుంది. కాగా.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఆసియాక్రీడల్లో ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ 41 ప‌త‌కాలు గెలుచుకుంది. ఇందులో 11 స్వ‌ర్ణాలు, 16 ర‌జ‌తాలు, 14 కాంస్య ప‌త‌కాలు ఉన్నాయి. 41 ప‌త‌కాల్లో ఒక్క షూటింగ్ విభాగంలోనే 21 ప‌త‌కాలు గెలుచుకోవ‌డం విశేషం.

ట్రెండింగ్ వార్తలు