Ind vs Pak: వరుణుడు వదలట్లే..! ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దయ్యే అవకాశం? అదేంలేదంటూ ACC ట్వీట్

ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్ 4లో ఆదివారం కొలంబో వేదికగా ప్రారంభమైన భార‌త్, పాకిస్తాన్ మ్యాచ్ రిజ‌ర్వ్ డే సోమవారంకు వాయిదా పడిన విషయం తెలిసిందే.

India vs Pakistan Match

India vs Pakistan Match IN Asia Cup 2023: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ (India vs Pakistan Match ) అంటే అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ప్రతీ బాల్‌ను టీవీలకు అతక్కుపోయి క్రికెట్ అభిమానులు చూస్తుంటారు. అదే ఆసియా కప్ లాంటి టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడితే ఇక క్రికెట్ అభిమానులకు పండుగే. కానీ, ఆసియా కప్ -2023 (Asia Cup 2023) లో అభిమానులకు నిరాశే ఎదురవుతుంది. గ్రూప్ స్టేజ్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. తాజాగా ఆదివారం సూపర్ -4లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కూడా వర్షం కారణంగా నిలిచిపోయింది. దీంతో రిజర్వు డే సోమవారంకు మ్యాచ్ వాయిదా పడింది.

India vs Pakistan Match: బుమ్రాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు

ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య సోమవారం మధ్యాహ్నం 3గంటల నుంచి మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉంది. అయితే, రిజర్వుడే రోజుకూడా వర్షం ముప్పు ఉండటంతో ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ జరిగే కొలంబోలో సోమవారం సాయంత్రం 4గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. మ్యాచ్ ప్రారంభమైన గంట తరువాత నుంచి వర్షం పడే అవకాశం 70 నుంచి 80శాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే జరిగితే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది.

IND VS PAK : రిజర్వ్‌ డేకు భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. వ‌రుణుడు క‌రుణించేనా..?

ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్ 4లో ఆదివారం కొలంబో వేదికగా ప్రారంభమైన భార‌త్, పాకిస్తాన్ మ్యాచ్‌లో వర్షం పడే సమయానికి భార‌త్ 24.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు న‌ష్టాపోయి 147 ప‌రుగులు చేసింది. కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లి (8)లు క్రీజులో ఉన్నారు. ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చిన రోహిత్ శ‌ర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) పాక్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికిదిగి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వర్షం లేకుంటే ఇవాళ మ్యాచ్ తిరిగి 24.2 ఓవర్ నుంచి ప్రారంభమవుతుంది.

అయితే.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మాత్రం.. అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఈరోజు పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌ జరుగుతుందని, వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొంది. మధ్యాహ్నం 3గంటలకు మ్యాచ్ పున: ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఈ ట్వీట్‌లో కొలంబోలో ప్రస్తుత వాతావరణ పరిస్థితిని తెలిపేలా ఫొటోలు షేర్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు